అధికారులు క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన చోట ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.#vvwnews

by vvwnews.com

• అధికారులు క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన చోట ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.
• మంత్రుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి, ఉద్యోగి వరకూ అంతా బాధ్యతగా ఉండాలి.
• వచ్చిన ఫిర్యాదులు వందశాతం పరిష్కారం కావాల్సిందే.
• ఆర్థికేతర ఫిర్యాదులను పరిష్కరించకుండా.. కొందరు పైకి కిందకు తిప్పుతున్నారు… వాటిని తక్షణం పరిష్కరించాలి.
• ఆర్థికపరమైన ఫిర్యాదుల గురించి కూడా విచారణ చేసి సరైన వాటిని పరిష్కరించాలి.
• 2027 మార్చి నాటికల్లా రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన కావాలి.
• సమస్య పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచనలు చేస్తే సుపరిపాలన అందించినట్టే.
• డబ్బులు లేవనడం కాదు… సంపద సృష్టి పని చేయాలి… చేద్దాం.

• *వెల్ఫేర్, డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్ అనేది ఓ సైకిల్.*
• *అభివృద్ధి లేకుండా సంపద లేదు. సంపద లేకుండా సంక్షేమం లేదు.*

• సూపర్ సిక్స్ పథకాలతో భద్రత, భరోసా కల్పించాం.
• పీ4తో ఆర్ధిక ప్రమాణాలు పెంచుతున్నాం
• 26 కొత్త పాలసీలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ అంటే నమ్మకాన్ని కల్పించాం.

• *రాయల్ ఎన్ ఫీల్డ్ ను డ్రైవ్ చేయడమనేది గర్వంగా ఉండేది.*
• *నా కాలేజీ రోజుల్లో కూడా ఎన్ ఫీల్డ్ డ్రైవ్ చేయడం చాలా గొప్పగా ఫీలయ్యేవాళ్లం.*
• *అలాంటి రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థను ఏపీకి తెచ్చాం.*

• రూ. 23 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నాం.
• ఇవి సాకారమైతే 24 లక్షల మేర ఉద్యోగాలు వస్తాయి.
• గ్రీన్ ఎనర్జీతో పాటు గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్తున్నాం.
• డేటా, ఏఐ, క్వాంటం లాంటి టెక్నాలజీలకు ఏపీ కేంద్రంగా మారనుంది.

• *గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఏపీకి వచ్చాయి.*
• *రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన చేసుకోగలుగుతున్నాం.*
• *వేసవిలో దేశ ప్రజలకు చల్లబరిచే ఏసీలు మన రాష్ట్రం నుంచే సరఫరా చేసే పరిస్థితికి వచ్చాం.*

Use Social Media to Spread the Word about Our News

related articles