కమలావతి బృందావనం రమణీయం – ఔషధ, పండ్లు కూరగాయలు, ఆకుకూరల మొక్కల – తీగ జాతులు అత్యధికం- చల్ దనం,ఆహ్ల

by vvwnews.com

కమలావతి బృందావనం రమణీయం
– ఔషధ, పండ్లు కూరగాయలు, ఆకుకూరల మొక్కలు
– తీగ జాతులు అత్యధికం
– చల్ దనం,ఆహ్లాదకరమైన వాతావరణం
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
కమలావతి బృందావనం రమణీయం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం అన్నారు. వనమాలి, సిటిజి సంస్థల ఏరియా అడ్మిన్ లు శనివారం సాయంత్రం ఆరిలోవ లో కమలావతి బృందావనం లో నిర్వహించిన ప్రకృతి కార్యాశాలలో రత్నం పాల్గొని మాట్లాడారు. ఇంటి పై కప్పు మీద ఉన్న మొక్కలు అందరికీ కన్నుల పండువగా దర్శనమిచ్చాయి, సపోటా, దానిమ్మ, నిమ్మ నారింజ తదితర పండ్లు నోరూరించాయి. ప్రధానంగా ఔషధ, పండ్లు కూరగాయలు, ఆకుకూరల మొక్కలు, తీగ జాతులు అత్యధికంగా ఉన్నాయి. ఇంత మెండు వేసవిలో అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన గాలి, చల్లదనం అందరూ ఆనందానుభూతి పొందారు.
ఈ కార్యక్రమంలో ప్రాంతీయ అడ్మిన్ లు కవిత, లలితా జ్యోతి, ఉష, ఉషారాణి లు మాట్లాడారు. పలువురు ఇంటి పై కప్పు మీద పంటలు పండించే వారు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles