జీవం ఉన్న పంటలనే ఆహారం గా భుజించాలి
– ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం
– ప్రకృతి పంటలే ఆరోగ్యకరం, ఆనంద దాయకం
– జన్యుమార్పిడి పంటలు వద్దే వద్దు
– పేరి రామకృష్ణ , విశ్రాంత డిప్యూటీ కలెక్టర్
జీవం ఉన్న పంటలనే ఆహారం గా భుజించాలి అని విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరి రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేట మండలం లోని కొండ పాలెం అగ్రహారంలో ప్రకృతి పంటల క్షేత్రం సందర్శించిన వారితో ఆయన మాట్లాడారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ నేతృత్వంలో కొద్దిమంది ఔత్సాహిక రైతులు వారు ప్రకృతి ఆధారంగా పంటలు ఎలా పండించుతున్నది పరిశీలించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవం ఉన్న పంటలతో మన పూర్వీకులు వంటలు ఎలా చేసుకున్నారో అలాంటి రుచి కరమైన, సుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలు వండటం, భుజించడం, అవగాహన కలిగించడం నేటి తరానికి అవగాహన కల్పించడం అవసరం అన్నారు. అలాగే పాత ఇత్తడి, మట్టి పాత్రలలో వంటడం ఉపయుక్తం అన్నారు. జన్యుమార్పిడి పంటలు వద్దే వద్దు అన్నారు. మనం మన సంస్కృతిని, కళలను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గోవర్ధన గిరి గోశాల ప్రతినిధి దొడ్డా మహేష్, ఔత్సాహిక ప్రకృతి పంటల రైతు నరేష్, మేంగొ మేన్ అప్పాజీ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.
జీవం ఉన్న పంటలనే ఆహారం గా భుజించాలి #vvwnews #news
4
previous post