పెదవాల్తేరులోని శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

by vvwnews.com

విశాఖపట్నం మార్చి 28, పెదవాల్తేరులోని శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి.రాజగోపాల్ రెడ్డి తెలిపారు.శనివారం ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన శ్రీ అమ్మవారి తొలేళ్ళ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని 31న అనుపు ఉత్సవం, ఏప్రిల్ 7న మారువారం పండుగ, 11 మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు సోమవారం రాత్రి పెదవాల్టైరు గ్రామంలో మద్ది వారి పెద్దింట వద్ద మరియు శ్రీ అమ్మవారి చదును పట్టు వద్ద తోలేళ్ళ ఉత్సవం జరుగుతుందని మంగళవారం అనుపు ఉత్సవం జాలర్ల సేవతో సాయంత్రం 6 గంటల నుండి మద్ది వారి పెద్దింటి నుండి చదునుపట్టు మీదుగా 14 గ్రామాల పెద్దల సమక్షంలో అమ్మవారు దేవాలయమునకు వేంచేస్తారని పేర్కొన్నారు.సోమవారం తొలి పూజ రాత్రి పది గంటల నుండి మొదలవుతుందని 2000 రూపాయలు చెల్లించిన భక్తుల్లో ఇద్దరిని మాత్రమే పూజకు అనుమతి ఇస్తామని పూజలో పాల్గొన్న భక్తులు విధిగా టికెట్లు తీసుకోవాలని పేర్కొన్నారు. శ్రీ అమ్మవారు ఉత్సవాలకు సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని సుమారు 70000 మందికిపైగా భక్తులు ఉత్సవంలో పాల్గొంటారని వెల్లడించారు.గత ఏడాది అమ్మవారి ఉత్సవాలు సందర్భంగా 30 లక్షల రూపాయలు ఖర్చు జరగ్గా 46లక్షలు రూపాయలు ఆదాయం సమకూరిందని ఏడాది 50 లక్షల రూపాయలు వరకు ఆదాయం రాగలదని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం 500 రూపాయల క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. శ్రీ అమ్మవారిని భక్తులు దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకోవాలని ఎగ్జిక్యూటిట్ ఆఫీసర్ టి.రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మద్ది శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తలు చిన్ని పిల్లి ఆనందరెడ్డి,వాడమొదల శ్రీనివాస్, పల్లా శాంతి, కంబాల వరలక్ష్మి, గుడివాడ పద్మ,సత్య కౌశల్య రాణి, పెడింట్ల అనిల్ కుమార్,పసగడుగుల వాసు ఏనుగుతల మంగరాజు,వాసుపల్లి పూర్ణ,ఎక్స్ ఆఫీషియో సభ్యులు, అర్చకులు సుదర్శనం సత్య శ్రీనివాస్, చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు .శ్రీ కరకచెట్టు పోలమాంబ జాతరకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ రాజగోపాల్ రెడ్డి తెలియజేసారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles