కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర ఏర్పాట్లపై సమీక్ష* #vvwnews

by vvwnews.com

*

* *అధికారులు సమన్వయంతో జాతర విజయవంతం చెయ్యాలి*

*శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు*

విశాఖపట్నం, మార్చి 26: దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలోని పెద వాల్తేరు ప్రాంతంలో వెలసిన శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 21 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్యూలైన్ వ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. జివిఎంసీ ద్వారా శానిటేషన్ పనులు సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందుబాటులో ఉంచాలని, ఫైర్ సర్వీసులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని ఆదేశించారు.
ప్రత్యేకంగా సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే సూచిస్తూ, దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఈ ఓ టి రాజగోపాల్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మద్ది శ్రీనివాస రెడ్డి, సభ్యులు చినిపిల్లి ఆనంద్ రెడ్డి, వాడమోదల శ్రీనివాస్, పల్లా శాంతి, కంభాల వరలక్ష్మి, గుడివాడ పద్మ, సత్య కౌసల్య రాణి, పిడింట్ల అనిల్ కుమార్, పసగడుగుల వాసు, ఏనుగుతల మంగరాజు, వాసుపల్లి పూర్ణ, సుదర్శనం సత్య శ్రీనివాస్ (ఎక్స్ ఆఫిషియో సభ్యుడు, అర్చకులు), పెదవాల్తేరు గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles