జీవవైవిధ్య పరిరక్షణ ప్రతి విద్యార్థి బాధ్యత
– అడవిలో విహరిస్తూ జీవవైవిధ్యం గురించి తెలుసుకోవాలి
– ఏ జీవి అంతరించినా నష్టం మానవాళికే
– శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చేయాలి
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
జీవవైవిధ్య పరిరక్షణ ప్రతి విద్యార్థి బాధ్యత అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. బుధవారం ఉదయం కర్నూలు జిల్లా కేంద్రంలోని నగర వనంలో నేషనల్ గ్రీన్ కోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం జిల్లా సమన్వయ కర్త ఆకుల రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనం పీల్చే గాలిలో రెండు శ్వాసల్లొ ఆక్సిజన్ లేకుంటే మృత్యువాత పడుతున్నారు. అందుకే మనం అంతా చెట్లు పెంచాలని, ప్రకృతి వనరులను కాపాడుకోవాలి అన్నారు. అందుకే ప్రకృతి కార్యశాలలు నిర్వహించాలని కోరారు. అడవిలో విహరిస్తూ జీవవైవిధ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. భూమి మీద ఏ జీవి అంతరించినా నష్టం మానవాళికే అని వివరించారు. శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చేయాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా సమన్వయ కర్త ఆకుల రాజశేఖర్ మాట్లాడుతూ ప్రకృతి కార్యశాలల అవసరం ఎంతైనా ఉంది అన్నారు. విద్యార్థులకు ప్రకృతి వనరుల పరిరక్షణ ఆవశ్యకత అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. నగరవనం లో ఉన్న పక్షులు, వాటి కిల కిలా రావాలు విద్యార్థులను బాగా ఆకట్టుకున్నాయి న్నారు. అలాగే బియ్యం పిండి తో ముగ్గులు వేయించడం, ఆ ముగ్గు వేసిన పిండిని చీమలు తీసుకుని వెళ్ళడం, విభిన్న జీవుల మాస్క్ లతో విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ రత్నం పక్షులు, ఇతర జీవులకు, నీరు, ఆహారం పెట్టె పాత్రలూ, గూళ్ళను తయారు చేయడం మీద అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లోని విభిన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు కె వీరేష్ బాబు, హైమవతి, శంకర్ , రంగస్వామి, పుల్లమ రాజు, కె భాస్కర్, మద్దిలేటి నల్లూరు , సుంకన్న, శారద, సిబి వెంకట రమణ రెడ్డి, ఎస్ . నజీమా, ఎన్ భరత్ కుమార్, జి శ్రీనివాసరెడ్డి, పి శివశంకరయ్య, సరస్వతమ్మ,, కుమార్ నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
జీవవైవిధ్య పరిరక్షణ ప్రతి విద్యార్థి బాధ్యత – అడవిలో విహరిస్తూ జీవవైవిధ్యం గురించి తెలుసుకోవాలి
8