భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విశాఖపట్నం జిల్లా ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెం 125 నుండి 129 సచివాలయంలో
అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలం సాగుభూమి సాధనకై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్రసమితి పిలుపులో భాగంగా కార్యక్రమం చేయడం జరిగింది సిపిఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్ మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు తక్షణమే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు ఎన్నికల ముందు ఇళ్లు ఇస్తామని ,ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు పట్టణంలో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు, ఇంటి స్థలం ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, భూమిలేని నిరుపేదలకు సాగుభూమి పంపిణీ చేయాలని, టిడ్కో ఇల్లులు ఇంతవరకు పేద ప్రజలకు అందజేయలేదని వెంటనే ఇల్లు స్వాధీనం చేయాలని
అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు ,వితంతులకు, ఒంటరి మహిళలకు, అంగవైకల్యం వాళ్లకి ,దీర్ఘకాల రోగాలు,గా ఉన్నవారికి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనియెడల సిపిఐ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నెయ్యల.. నాగభూషణరావు , అక్కయ్యపాలెం శాఖ కార్యదర్శి ఏ.రాజాక్ పార్టీ సభ్యులు వామనమూర్తి,శివ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు
125 to129 సచివాలయంలోఅర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలం సాగుభూమి సాధనకై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ
9