*వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వపరంగా హామీ*
*త్వరలో కొన్ని డిమాండ్లు పరిష్కారం*
*చలో విజయవాడ భారీగా విజయవంతం*
*జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల*
డాబా గార్డెన్స్.. మార్చ్ 17
రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా కొంతమేర హామీ లభించినట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ఏజే) విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ లు తెలిపారు ..మంగళవారం డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం
ప్రెస్ క్లబ్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ..ఏపీ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లు ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో వీరు మాట్లాడారు.. మార్చి 4 న ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతం అయిందన్నారు.. రాష్ట్రవిభజన తర్వాత జర్నలిస్టులు అంత పెద్ద మొత్తంలో తరలి రావడం ఇదే తొలిసారి అన్నారు..ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన చేసిన సభలో వేలాది మంది జర్నలిస్టులు సమక్షంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ.. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సుమారు 13 అంశాలను పూర్తిస్థాయిలో తమ రాష్ట్ర నేతలు వివరించడం జరిగిందన్నారు. దాని ఫలితం వల్లే కొన్ని డిమాండ్లు త్వరలో పరిష్కారం కానున్నట్లు వీరు చెప్పారు.. ఆరోజు సభలో మంత్రి పార్థసారథి ఒక్కొక్క అంశాన్ని తానే స్వయంగా నమోదు చేసుకున్నారని అందులో కొన్ని డిమాండ్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి చెప్పారన్నారు.. ప్రధానంగా జర్నలిస్టుల సొంత ఇంటి కల
ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో త్వరలో సాకారం అయ్యే
అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.. గత రెండు ప్రభుత్వాలు హయాంలో జర్నలిస్టులు నానా ప్రయాసలు పడి దరఖాస్తులు చేసినప్పటికీ తగిన పరిష్కారం లభించలేదన్నారు.
ఈసారి కూటమి ప్రభుత్వ హయాంలో తప్పకుండా జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉందన్నారు.. ఇక పెన్షన్ విధానానికి సంబంధించి అధ్యయనం జరుగుతున్నదని
చెప్పడం జరిగిందన్నారు. అలాగే ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరణ.. జర్నలిస్టుల వృద్ధాశ్రమం వివిధ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలకు .. ప్రాతినిథ్యం కల్పించడం… జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు. విద్య వైద్యం కార్పొరేట్ సంస్థల నుంచి ఉచితంగా అవకాశం
కల్పించాలని.. కార్మిక భీమా పాలసీ కు సంబంధించి సంబంధిత మంత్రి వాసంశెట్టి సుభాష్ కు తెలియజేశామన్నారు…. ప్రభుత్వ పరంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలు కల్పిస్తున్నందున జర్నలిస్టులకు సామాజిక బాధ్యతగా ఆయా సంస్థలు విద్య.. వైద్య.. కార్మిక భీమా సదుపాయాలు కల్పించడం
కష్టతరం కాదన్నారు.. సుమారు 13 డిమాండ్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.. ఇందులో కొన్ని డిమాండ్లు తక్షణమే పరిష్కరించ వచ్చునని కూడా చెప్పామన్నారు.. అయితే ఇప్పటికే మంత్రి పార్థసారథి ఆయా డిమాండ్లను మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించినట్లు తమకు సమాచారం ఉందన్నారు ..అలాగే మంత్రి పరంగా కూడా కొన్ని చిన్న చిన్న డిమాండ్లు పరిష్కరిస్తామని తగిన హామీ ఇచ్చారన్నారు.అన్ని డిమాండ్లు ఒకేసారి కాకపోయినప్పటికీ చిన్న చిన్న డిమాండ్లు పరిష్కరించ వచ్చునని
తాము చెప్పామన్నారు. జర్నలిస్టుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని త్వరలోనే కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినట్లు వీరు వివరించారు..
చలో విజయవాడ ..ఉగాది సంబరాలు విజయవంతం చేసిన జర్నలిస్టులు అందరికీ ఫెడరేషన్ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ సమావేశంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ డి రవికుమార్.. ఉపాధ్యక్షులు రామకృష్ణ ..నగేష్ బాబు.
బ్రాడ్ కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు కింతాడ మదన్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ విశాఖ అధ్యక్షులు జగన్మోహన్.. ఇన్చార్జ్ కార్యదర్శి బొబ్బర ప్రసాద్.. సంఘాల నేతలు శేషు.. రాజశేఖర్ జీవన్ తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు..