‘సాధక్’గా ‘ఉద్యమి’ల సభ్యత్వాలు నమోదు చేసిన ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు ఆదివారం భీమిలి నియోజకవర్గం, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్ నియోజకవర్గాల్లో జరుగుతున్న జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పర్యవేక్షించారు. పీ.ఎం. పాలెం, ఎన్.ఏ.డీ. జంక్షన్, మురళీనగర్, ఎం.వీ.పీ. కాలనీ మార్కెట్ ప్రాంతాల్లో శ్రీ కె. నాగబాబు గారు ‘సాధక్’గా ‘ఉద్యమి’ల సభ్యత్వాలు నమోదు చేశారు. స్థానిక ప్రజలు, కార్యకర్తలు శ్రీ నాగబాబు గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. జనసేన సభ్యత్వ నమోదులో ‘సాధక్’ పాత్ర కీలకమని, ఒక కార్యకర్తగా, ‘సాధక్’గా సభ్యత్వాలు నమోదు చేసిన అనుభూతి మరచిపోలేనిదని అన్నారు. సభ్యత్వ నమోదు గడువు ముగుస్తున్న నేపథ్యంలో అనుకున్న స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు.
#JanasenaUdyami