గర్భధారణలో సర్వికల్ స్టిచ్ (Cervical Stitch)ఇప్పుడు సర్వికల్ స్టిచ్ అంటే ఏమిటి?

by vvwnews.com

గర్భధారణలో సర్వికల్ స్టిచ్ (Cervical Stitch)
ఇప్పుడు సర్వికల్ స్టిచ్ అంటే ఏమిటి? ఎవరికి అవసరం అవుతుంది? అనే విషయాన్ని తెలుసుకుందాం.
సర్వికల్ స్టిచ్ రెండు రకాలుగా ఉంటుంది:
ఎలెక్టివ్ ఎంకర్లాజ్ (Elective Cerclage)
ఎమర్జెన్సీ ఎంకర్లాజ్ (Emergency Cerclage)
🔹 ఎలెక్టివ్ ఎంకర్లాజ్:
ఇది ముందుగా ప్లాన్ చేసి చేసే ప్రక్రియ.
సర్విక్స్ బలహీనంగా (Cervical incompetence) ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత, గర్భధారణ 4వ నెలలో స్టిచ్ వేయడానికి ప్లాన్ చేస్తారు.
ఎవరికి అవసరం ఉంటుంది?
వరుసగా 4వ లేదా 5వ నెలలో గర్భస్రావం జరిగిన వారు
గతంలో ముందస్తు ప్రసవాలు (Preterm deliveries) జరిగిన వారు
సర్విక్స్‌పై గతంలో శస్త్రచికిత్సలు జరిగిన వారు
గర్భాశయం ఆకారంలో లోపాలు (Anomalous uterus) ఉన్న వారు
ఈ పరిస్థితుల్లో సర్విక్స్ బలహీనంగా ఉంటుంది. అందువల్ల చెడు ఫలితాలను నివారించడానికి ఎలెక్టివ్ సర్వికల్ ఎంకర్లాజ్ అవసరం అవుతుంది.
🔹 ఎమర్జెన్సీ ఎంకర్లాజ్:
TIFFA స్కాన్‌లో సర్వికల్ పొడవు 2.5 సెం.మీ కన్నా తక్కువగా ఉన్నప్పుడు లేదా సర్విక్స్ తెరుచుకునే సూచనలు ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ సర్వికల్ ఎంకర్లాజ్ చేయాలని సలహా ఇస్తారు.
సర్వికల్ స్టిచ్ వేయడం ద్వారా గర్భస్రావం లేదా ముందస్తు ప్రసవాన్ని నివారించవచ్చు.

Use Social Media to Spread the Word about Our News

related articles