చెత్త రహిత పాలనకు ప్రజలు అందరూ సహకారం అందించాలి #vvwnews

by vvwnews.com

చెత్త రహిత పాలనకు ప్రజలు అందరూ సహకారం అందించాలి
– మన విశాఖ ను మనమే దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి
– విద్యార్థులు అందరూ పర్యావరణ హితంగా జీవించాలి
– శృతి శ్రీ, విశాఖ జిల్లా ఐఇసి కోఆర్డినేటర్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్
చెత్త రహిత పాలనకు ప్రజలు అందరూ సహకారం అందించాలి అని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ విశాఖపట్నం జిల్లా ఐఇసి కోఆర్డినేటర్ శృతి శ్రీ పిలుపునిచ్చారు. ఎం విపి కాలనీలో సెవెంత్ డె అడ్వెంటిస్ట్ విద్యా సంస్థలో సోమవారం ఉదయం ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ల నేతృత్వంలో స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర లో భాగంగా “చెత్త రహిత పరిపాలన” (జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మన దేశానికి ఆదర్శంగా విశాఖను తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులు అందరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరుతూ అవగాహన కల్పించారు. మేధావులు సహకారం అందించాలన్నారు. విద్యార్థులు, మహిళలు, నగరవాసులు అందరూ చెత్త రహిత నగరంగా విశాఖ మహానగరాన్ని తీర్చి దిద్దడానికి కంకణబద్ధులై జీవించాలని కోరారు.‌ మన అందమైన నగరాన్ని ఒక సుందరమైన విధంగా తీర్చి దిద్దాలని కోరారు. వంటింటి వ్యర్థాలతో ఎరువు తయారు చేసి ఎవరి ఇంటి వద్ద వారె కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించడం అవసరం అని వివరించారు. సమస్త జీవరాశి నీ కాపాడుకోవాలి అని వివరించారు. ప్రతి విద్యార్థి ఒక హరిత సైనికులు గా మారాలి అని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో కన్వీనర్ విశాలాక్షి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, గ్రీన్ వాలంటీర్ జె రాజేశ్వరి, హెడ్ మాస్టర్ జాస్లిన్ నవీన్ విప్పర్తి తదితరులు పాల్గొని మాట్లాడారు

Use Social Media to Spread the Word about Our News

related articles