ఫిబ్రవరి 12 న స్కూలు పిల్లల ఆటోలు బంద్ లో పాల్గొనండి జి వామనమూర్తి పిలుపు#vvwnews

by vvwnews.com

ఫిబ్రవరి 12 న స్కూలు పిల్లల ఆటోలు బంద్ లో పాల్గొనండి జి వామనమూర్తి పిలుపు కేంద్ర ప్రభుత్వం చేసిన నాలుగు లేబరు కోడ్స్ ను రద్దు చేయాలని డ్రైవర్ల కడుపులు కొట్టే ఓలా ఓవర్ రాపిడో టూవీలర్ బైక్లను రద్దుచేసి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ తేదీ 8 2 2026 ఉదయం పదిగంటలకు ద్వారకానగర్ జంక్షన్ వద్ద గోడ పత్రిక ఆవిష్కరణ అనంతరం ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెనురాష్ట్రంలో స్కూలు పిల్లల ఆటోలు బంద్ ను మోటార్ వాహనాలు సమ్మెని జయప్రదం చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు ఆటో డ్రైవర్ కడుపులు కొట్టే ఓలా ఊబర్ రాపిడో టు వీలర్ ఆన్లైన్ యాప్ రద్దుచేసి డ్రైవర్ జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్టాండ్ అధ్యక్షులు యు శివాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటోలు వ్యానులు కారులు జీపులు ఇతర మోటార్ వాహనాలు ఎఫ్ సి డ్రైవింగ్ లైసెన్సులు ఎల్ ఎల్ ఆర్ లు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎఫ్ సి ఫిట్నెస్ లు చేయాలని డిమాండ్ చేశారు 2026 వాహన మిత్ర వెంటనే డ్రైవర్లకు ఇవ్వాలని జెడి మానాల పెంచే జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న విశాఖలో ఆటోలు బంద్ ను మోటార్ వాహనాలు సమ్మెను జయప్రదం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దేవుడు శ్రీను ఈశ్వర్ ఎల్లాజీ అభి బాబు శ్రీను మన్మధ రాజు జి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు యు శివాజీ స్టాండ్ అధ్యక్షులు

Use Social Media to Spread the Word about Our News

related articles