4
విశాఖపట్నం కంబాలకొండ అభయారణ్యం నుండి శుక్రవారం మధ్యాహ్నం అడవి జింకలు జాతీయ రహదారిపైకి వచ్చాయి. వేగంగా వెళ్లే వాహనాల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు వీధి కుక్కల దాడులు కూడా పెరుగుతున్నాయి. అటవీ శాఖ తక్షణమే స్పందించి రహదారి వెంబడి రక్షణ గోడలు లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, మూగజీవాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. వన్యప్రాణుల రక్షణలో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.