విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి అవసరమైన నైతిక విలువలు మరియు వ్యక్తిత్వ

by vvwnews.com

ఎస్. రాయవరం మండలం, అడ్డరోడ్డు తిమ్మాపురంలోని ‘శ్రీ ఆదర్శ పాఠశాల’ వేదికగా నిర్వహించిన అద్భుతమైన ఆధ్యాత్మిక, నైతిక విద్యా కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
“విద్యాదీప్తి – సంస్కార స్ఫూర్తి” అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (నైతిక విలువలు) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అందించిన జ్ఞాన సంపద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని ఆశిస్తున్నాను.
విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి అవసరమైన నైతిక విలువలు మరియు వ్యక్తిత్వ వికాసంపై గురువుగారు అందించిన సందేశం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది.
ఐటీ, విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ Nara Lokesh గారు భావి తరాల కోసం విద్యార్థుల్లో నైతిక విలువల పెంపుకు ఎంతో కృషి చేస్తున్నారు. వారి ప్రణాళికలకు అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి.
సుమారు 2000 మంది విద్యార్థులతో కలిసి ఈ జ్ఞానసభలో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. విద్యార్థులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

#SRayavaram #AdarshaPathashala #ChagantiKoteswaraRao #VidyaDeepthi #SamskaraSphurthi #MoralEducation #ValueBasedEducation #StudentsFuture #SocialResponsibility #EducationWithValues #ManaPayakaraopeta #AndhraPradesh #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #VangalapudiAnitha #HomeMinisterAnitha

Use Social Media to Spread the Word about Our News

related articles