మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ(MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర ! #vvwnews

by vvwnews.com

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ(MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర రెండో రోజు సైతం అనంతపురం జిల్లాలో సాగింది. కళ్యాణదుర్గం నియోజక వర్గం, ఐదుకల్లు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్థులు మన్రేగా చట్టం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆనాడు 2006 లో దివంగత ముఖ్యమంత్రి YSR సారథ్యంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం తమ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిందని, గ్రామాలు అభివృద్ధి జరిగాయని, గ్రామ్ జి చట్టం తెచ్చి మోదీ గారు కరువు పనిపై కుట్రలు చేయడం దారుణమని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఉపాధి హామీ పరిరక్షణ పోరాటానికి ఐదుకల్లు గ్రామస్థులు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరింది.

Use Social Media to Spread the Word about Our News

related articles