54 వార్డ్ జ్యోతినగర్ గ్రీన్ బెల్ట్ వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by vvwnews.com

విశాఖ ఉత్తర నియోజకవర్గం 54 వార్డ్ జ్యోతినగర్ గ్రీన్ బెల్ట్ వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు అధ్యక్షులు, కూటమి నాయకులు చల్లా ఈశ్వరరావు జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉండాల్సిన దేశభక్తి, రాజ్యాంగ విలువలు, మహాత్మా గాంధీ, అంబేద్కర్, నేతాజీ తదితర మహానేతల స్ఫూర్తి గురించి వివరించారు. ముందుగా వార్డు నాయకులు బృందావనం దంతేశ్వరరావు కుమార్తె రుచిత ప్రసంగానికి అందరూ మంత్రముగ్ధులయ్యారు. రాబోయే తరానికి కాబోయే మరో ఝాన్సీ లక్ష్మీబాయి అని చల్లా ఈశ్వరరావు కొనియాడారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సీనియర్ నాయకులు, అధ్యక్షులు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జివి రమణ, కార్యదర్శి రవికుమార్, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ సుగుణ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles