పూర్ణామార్కెట్లో పూజా సామాగ్రి దగ్ధంపై పరామర్శ
* బూడిదైనా రూ. 50 లక్షల సామాగ్రి
* నష్టపోయిన వ్యాపారులను ఆదుకోవాలి
* దక్షిణ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
విశాఖ దక్షిణం పూర్ణా మార్కెట్లో అగ్నిప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను ప్రభుత్వ ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. అర్థరాత్రి జరిగిన
సంఘటనా స్థలాన్ని దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులతో కలిసి వాసుపల్లి సందర్శించారు. వ్యాపారులను పరామర్శించి అగ్ని ప్రమాదం గల కారణాలు నష్టపోయిన సామాగ్రి విలువ అంచనా వివరాలను సేకరించారు. ఆకస్మికంగా చెలరేగిన ఈ మంటల వల్ల 16 పూజ సామాగ్రి షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయన్నారు. సుమారు 50 లక్షల సరుకు బూడిదవ్వడం దురదృష్టకరమన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారనీ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కానీ షాపులో ఉన్న సామాగ్రి పూర్తిగా అగ్నికి బూడిద అయిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో 35 వార్డ్ ప్రెసిడెంట్ కనక రెడ్డి, జిల్లా సెక్రటరీ అభిరెడ్డి అది విష్ణు, జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్, సౌత్ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ సుధా, గంగాధర్, నగేష్, బతుల రాము, ఈశ్వరరావు,ఇషు,బేవార మహేష్, తాడి రవితేజ, 36 వార్డ్ ప్రెసిడెంట్ మహమ్మద్ షకీల్,దక్షిణ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.