అప్పన్న సన్నిధిలో జననేత జన్మదినోత్సవం వేడుకలు కుటుంబ సమేతంగా చిన్న శ్రీను గారు కుమార్తె సిరమ్మ

by vvwnews.com

*సింహాద్రి అప్పన్న సన్నిధిలో జననేత జన్మదినోత్సవం వేడుకలు*

*కుటుంబ సమేతంగా పాల్గొన్న చిన్న శ్రీను గారు కుమార్తె సిరమ్మ*

*ఈ సందర్భంగా 381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారం స్వామి వారికి సమర్పణ*

*వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి పేరు మీద ప్రత్యేక పూజలు*

*ఆనందంలో వై.యస్.ఆర్.సి.పి. కార్యకర్తలు*

*అంబరాన్ని అంటిన సంబరాలు*

తే 21.12.2025 దీ ,
భీమిలినియోజకవర్గం,
సింహాచలం.

ఈ రోజు మన ప్రియతమ నాయకులు , వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నీయులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గం, సింహాచలంలోని అప్పన్న సన్నిధిలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , వై.యస్.ఆర్.సీపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త గౌIIవ నీయులైన శ్రీ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను )గారు , సతీమణి శ్రీమతి మజ్జి పుష్పాంజలి గారు , అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గం వై.యస్.ఆర్.సీపి.యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు , కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ఆదివారం సింహాచలం లోని సింహాద్రి అప్పన్నను దర్శించి, పట్టువస్త్రాలు సమర్పింఛి , ప్రత్యేక పూజలు చేసారు .అనంతరం స్వామి వారికి ఈ సందర్భంగా *381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారం* ను కుటుంబ సమేతంగా సమర్పించారు. అంతకు ముందు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం వేదపండితుల ఆశీర్వాదం పొందారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదన్నారు . ప్రస్తుత ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా ఉందన్నారు. అందువల్ల మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని త్వరలోనే ప్రజలుకు మంచి రోజులు వస్తాయన్నారు .

ఈ కార్యక్రమం లో భీమిలి నియోజకవర్గ పరిధిలో పార్టీ SEC మెంబర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీ లు ,కార్పొరేటర్లు. జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, మహిళా ప్రజా ప్రతినిధులు, పార్టీనాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు స్థానిక ముఖ్య నాయకులు , ప్రజా ప్రతినిధులు , వైసిపి కార్య కర్తలు , చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు , వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు .

Use Social Media to Spread the Word about Our News

related articles