దివంగత నేత స్వర్గీయ శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి వేడుకలు సిరిపురం సమీపంలోని ద్రోణంరాజు

by vvwnews.com

విశాఖపట్నంలో దివంగత నేత స్వర్గీయ శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి వేడుకలు సిరిపురం సమీపంలోని ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ గారు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ద్రోణంరాజు సత్యనారాయణ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు సత్యనారాయణ గారిని “ఉత్తరాంధ్ర టైగర్”గా పేర్కొంటూ, అనేకమంది నాయకులను రాజకీయాల్లోకి తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అనంతరం ద్రోణంరాజు శ్రీవత్సవ గారు మాట్లాడుతూ, తన తాత ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, తండ్రి ద్రోణంరాజు శ్రీనివాస్ గారి అడుగుజాడల్లో నడుస్తానని తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles