విశాఖపట్నం జిల్లా బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల సమాఖ్య (VDBRF) సాధారణ సభ #vvwnews

by vvwnews.com

ప్రెస్ నోట్

విశాఖపట్నం, డిసెంబర్ ___ :

విశాఖపట్నం జిల్లా బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల సమాఖ్య (VDBRF) సాధారణ సభ విశాఖపట్నంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా బ్యాంక్ రిటైర్డ్ ఫెడరేషన్ (AIBRF) అధ్యక్షులు కామ్రేడ్ బి. వి. వి. కొండలరావు అధ్యక్షత వహించారు. ఆయన ప్రసంగిస్తూ ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ అప్‌డేషన్ అత్యవసరం అని, అలాగే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో L1 విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.

సమావేశాన్ని AIBRF సంయుక్త ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జి. రామచంద్రరావు ప్రారంభిస్తూ ప్రసంగించారు. కుటుంబ పెన్షన్ ప్రయోజనాలు వివరించిన ఆయన, 1986 నుంచి పెన్షన్ బేసిక్ మారకుండా కొనసాగుతుండటంతో పెన్షన్ అప్‌డేషన్ అవసరం ఉందని స్పష్టం చేశారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జోన్ జోనల్ హెడ్ డా. హెచ్. టి. వాసప్ప మాట్లాడుతూ, మానవ సంబంధాలే జీవితాన్ని సార్థకంగా నడిపించే ప్రధాన అంశం అని తెలిపారు. అలాగే సీనియర్ సిటిజన్ల జీవితంలో ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరుతూ, బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం రీజియన్ రీజినల్ హెడ్ శ్రీ జె. సింహాచలం సభను ఉద్దేశించి మాట్లాడుతూ, బ్యాంకింగ్ రంగంలో యూనియన్లు కీలక పాత్ర పోషించాయని వివరించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల సాధనలో నాయకత్వం చూపిన అవిరామ కృషిని అభినందించారు.

ఏపీబీఆర్‌ఎఫ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ పి. వీరారెడ్డి రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం రెండో దశ ఉద్యమం అవసరమని, అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్స్-గ్రేషియా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీబీఆర్‌ఎఫ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ వి. జగన్మోహనరావు మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత అవసరం అని, ముఖ్యంగా UFBU వంటి ఉద్యోగ సంఘాల మద్దతు కీలకమని పేర్కొన్నారు.

వీడీబీఆర్‌ఎఫ్ అధ్యక్షులు శ్రీ పి. శ్రీనివాస్ డిసెంబర్ 30న విశాఖపట్నం GVMC ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించి, బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సభను వీడీబీఆర్‌ఎఫ్ కార్యదర్శి శ్రీ ఆర్. వి. రవి కుమార్ నిర్వహించి స్వాగత ప్రసంగం చేశారు. 70 సంవత్సరాలు పూర్తి చేసిన రిటైర్డ్ ఉద్యోగులను సత్కరించారు.
శ్రీ భాస్కర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీబీఆర్‌ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఐ. కేసవరావు మాట్లాడుతూ, విశాఖపట్నం రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాను ఘనంగా విజయవంతం చేస్తారని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఇండియన్ బ్యాంక్ డీజీఎం (రిటైర్డ్) శ్రీ నాయిక్, ఆంధ్రా బ్యాంక్ డీజీఎంలు (రిటైర్డ్) శ్రీ వాసుదేవ మూర్తి, శ్రీ ఎం. శ్రీనివాస్ వేదికపై పాల్గొన్నారు.
సుమారు 150 మంది కామ్రేడ్లు సమావేశానికి హాజరై సమావేశాన్ని ఘన విజయంగా నిర్వహించారు

Use Social Media to Spread the Word about Our News

related articles