ఘనంగా కాపుల ఆత్మీయ సమావేశం
* పాల్గొన్న ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు
కాపు యువసేన ఆధ్వర్యంలో ఆదివారం ముదసర్లోవ పార్క్ ఆవరణలో కాపు సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనం, కాపు సామాజిక వర్గ వనభోజనం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కి చెందిన కాపు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు పాల్గొని మాట్లాడుతూ ప్రతీ ఏడాది ఇలాంటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని కోరారు. కాపులంతా ఏకతాటి పైకి రావాలని కోరారు. వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు మాట్లాడుతూ కాపు సమావేశంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని,కాపు సామాజిక వర్గం వారికి ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. విజయనగరం ఎం పి శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎం ఎస్ ఎం ఈ చైర్మన్ శ్రీ టి.శివ శంకర్ గారు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ యశస్వి గారు, పొల్యూషన్ బోర్డ్ డైరెక్టర్ శ్రీ పంచకర్ల సందీప్ గారు, కార్పొరేటర్ శ్రీ ఉషశ్రీ, మాజీ ఎం పి బొత్స ఝాన్సీ గారు, మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ ధర్మశ్రీ, కాపు యువసేన ప్రతినిధులు సేనాపతి వెంకటేశ్, డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్, డాక్టర్ నాగరాజు, జి వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులు, మేధావులు, వ్యాపారవేత్తలకి నిర్వాహకులు సన్మానం చేశారు. సుమారు నాలుగు వేల మందికి పైగా పాల్గొన్నారు.
ఘనంగా కాపుల ఆత్మీయ సమావేశం * పాల్గొన్న ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు
15