సిరిపురంలో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యవసర సేవలు ఆరంభం
• 24/7 చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ & OPD సెంటర్ ఆవిష్కరణ
• నిపుణులైన పీడియాట్రిక్ వైద్య బృందాల మద్దతుతో 24/7 అత్యవసర సేవలు
• అధునాతన సంరక్షణ సామర్థ్యాలతో పీడియాట్రిక్ అత్యవసర సేవలుకొరకు రూపొందించిన కేంద్రం
విశాఖపట్నం 6 డిసెంబర్ 2025: భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్ మల్టీ-స్పెషాలిటీ మరియు పెరినాటల్ కేర్ హాస్పిటల్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, కైల్‌సమెట్టలో తమ కొత్త 24/7 చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ మరియు OPD సెంటర్‌ను ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీ శంఖా బ్రతా బాగ్చి, IPS ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ ప్రారంభోత్సవంలో సీనియర్ వైద్యులు, ఆసుపత్రి యాజమాన్య బృందాలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈ పిడియాట్రిక్ అత్యవసర సేవలు ఆరంభించటం ద్వారా విశాఖపట్నంలో పీడియాట్రిక్ కేర్ సేవలు విస్తరిస్తోంది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 24/7 అత్యవసర సేవలు మరియు OPD ఆపరేషన్ల ద్వారా, ఈ కేంద్రం ఈ ప్రాంతం అంతటా కుటుంబాలకు సకాలంలో, ప్రత్యేకమైన మరియు సమగ్రమైన పీడియాట్రిక్ సంరక్షణను అందించే సామర్థ్యతను కలిగి ఉంటుంది రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం తెలిపారు.
భారతదేశంలోని తృతీయ సంరక్షణ కేంద్రాల అధ్యయనాలు పిల్లల అత్యవసర పరిస్థితుల స్థాయిని మరియు తీవ్రతను ప్రముఖంగా వివరించాయి. అలాంటి ఒక అధ్యయనంలో ఆరు సంవత్సరాలలో పీడియాట్రిక్ అత్యవసర విభాగానికి సుమారు 43,800 మంది పిల్లలు వచ్చినట్లు నివేదించబడింది, వీరిలో దాదాపు 42 శాతం మందికి ప్రాథమిక పరీక్షలు అనంతరం అడ్మిషన్ చేయవలసిన అవసరం ఏర్పడినది. ఈ కేసుల విషయంలో సకాలంలో చికిత్సలు అందించకపోతే ఫలితాలు విషమించే ప్రమాదముందని నొక్కి చెపుతున్నాయి. దీనినే వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్ గా చెపుతారు.
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పిల్లల అత్యవసర సేవల కేంద్రం ఆవిష్కరణ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ రజిని ముఖర్జీ మాట్లాడుతూ, సకాలంలో పిల్లలపై దృష్టి సారించి అత్యవసర మరియు ఔట్ పేషెంట్ సంరక్షణ చికిత్సలను అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శిక్షణ పొందిన పీడియాట్రిక్ నిపుణుల సహకారంతో ప్రాధమిక చికిత్సలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తాయి అన్నారు. ఈ నూతన సేవా కేంద్రం పిల్లల వైద్య అవసరాలను సమర్థవంతంగా మరియు దయార్ద్ర హృదయంతో తీర్చడానికి సంసిద్దంగా ఉందని ఆమె తెలిపారు.
విశాఖపట్నంలో పిల్లల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయుటకు ఈ అత్యవసర మరియు OPD సేవలు రూపొందించినట్లు డాక్టర్ శాశ్వత్ మహంతి పేర్కొన్నారు. అధునాతన వైద్య మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన శిశువైద్యులు మరియు క్రిటికల్ కేర్ సేవలు, అత్యవసర పరిస్థితులకు తక్షణ సేవలు మరియు అవుట్ పేషెంట్ సంప్రదింపులకు ఈ కేంద్రం అనుకూలమని ఆయన అన్నారు.
డాక్టర్ చుప్పన రాగ సుధ, సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి వైద్యులు మరియు గైనకాలజిస్ట్ మాట్లాడుతూ, ఈ సేవలకు బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్స్ మద్దతు ఇస్తుంది, మహిళల మరియు పిల్లల సంరక్షణ మరియు సంతానోత్పత్తిలో ప్రత్యేక సేవలను మరియు ప్రపంచ స్థాయి వైద్య నైపుణ్యాన్ని కుటుంబాలకు ముంగిటకు తీసుకురావడం, మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించటం ఈ కేంద్రం లక్ష్యం అన్నారు.