డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 69 వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు

by vvwnews.com

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 69 వర్థంతి సందర్భంగా కంచరపాలెం ఇందిరానగర్-1లో దళిత సేన ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొలమాల అప్పారావు మాట్లాడుతూ.. దళితుల సాధికారత, పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం పరితపించారని అన్నారు. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన దార్శనికుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సేన సిటీ కన్వీనర్ గొలమాల మీనా, పుచ్చా కామేశ్వరరావు, తాడిపూడి సీతారాం, ఝాన్సీ రాణి, గోపి, పవన్ కుమార్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles