4
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రైల్వే న్యూకాలనీ శ్రీ శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం ఆధ్వర్యంలో కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా భక్తుల స్వహస్తాలతో మహా రుద్రాభిషేకం వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు శేషగిరిరావు మాట్లాడుతూ.. భక్తులు ఎంతో నిష్టతో, ఎంతో పవిత్రంగా పూజించే కార్తీక మాసం ఆఖరి రోజున శివలింగానికి పంచామృతం, విభూది, అన్నాభిషేకం, సుగంధ ద్రవ్యాలతో మహా రుద్రాభిషేకం తదితర పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే గత కోనేళ్లుగా ప్రతి ఏటా మాల ధరించిన ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.