CARE HOSPITALS
ప్రెస్ రిలీజ్
గుండెలు మార్చే మొనగాళ్లు ఇప్పుడు మన విశాఖలో
విశాఖ వైద్య చరిత్రలో మరో మైలురాయి
54 ఏళ్ల రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మనిచ్చిన కేర్ వైద్యులు
గుండె పని చేయడం ఆగిపోతే జీవితం ముగిసిందనిపిస్తుంది. అలాంటి గుండెను ఆరోగ్యకరమైన కొత్త గుండెతో మార్చడం ఆధునిక వైద్య రంగంలోని అతిపెద్ద విజయాల్లో ఒకటి
19 నవంబర్ 2025: 54 ১০ విశాఖపట్నం, మాయమైపోతుందనుకున్న వ్యాపారవేత్తకు కొత్త గుండెతో కొత్త శ్వాసను అందిస్తూ కేర్ హాస్పిటల్స్ వైద్యులు విశాఖలో పాత్రో గారికి మారింది. మరో వైద్య అద్భుతాన్ని నమోదు చేశారు. డాక్టర్ ఎల్. విజయ్ గారి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ సంక్లిష్ట గుండె మార్పిడి శస్త్రచికిత్స పునర్జన్మలా శ్రీకాకుళం ఆసుపత్రి నుండి దాత హృదయాన్ని తరలించడానికి పోలీసులు ఏర్పాటు చేసిన మెరుపువేగ గ్రీన్ కారిడార్ ఈ విజయానికి ప్రధాన బలం. ఇస్కీమిక్ సమయాన్ని తగ్గించి, మార్పిడి ప్రక్రియను అత్యంత ఖచ్చితంగా పూర్తి చేయడానికి అది కీలకంగా నిలిచింది. అవయవాన్ని సమయానికి, ఎలాంటి ఆటంకం లేకుండా చేరవేయడంలో సహకరించిన జిల్లా పోలీస్ మరియు ట్రాఫిక్ శాఖలకు ఆసుపత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
తూర్పు భారతదేశంలోని కీలక వైద్య కేంద్రంగా విశాఖపట్టణం వేగంగా ఎదుగుతోంది. అత్యాధునిక చికిత్సలు అందించే గమ్యస్థానంగా కూడా తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. ఈ విజయవంతమైన హృదయ మార్పిడి శస్త్రచికిత్స విశాఖకు ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇకపై ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, చత్తీస్గఢ్ మరియు ఈశాన్య భారత రాష్ట్రాల హృదయ రోగులు కూడా మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విశాఖలోనే ఇలాంటి క్లిష్ట శస్త్రచికిత్సలు చేయించుకునే అవకాశం లభించనుంది.
పత్రో టిసిఎంపి (టకోట్సుబో కార్డియోమయోపతి) వ్యాధితో బాధపడుతూ, పదేపదే వెంటిక్యులార్ కారణంగా కేర్ హాస్పిటల్స్లో ఆయనకు టాకీకార్డియా వచ్చే సమస్యను ఎదుర్కొన్నారు. ముందే ఏఐసిడి (ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్) ఇంప్లాంటేషన్ చేశారు.