పత్రికా ప్రచురణార్థం
సంధ్యా మెరైన్స్ వైజాగ్ మారథాన్- 4 వ సంచిక
మన వైజాగ్ – మన మారథాన్
టీ-షర్ట్ & మెడల్ ఆవిష్కరణ కార్యక్రమం | నవోటెల్ నాటికా హాల్ | విశాఖపట్నం | అక్టోబర్ 27, 2025
వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ 30, 2025 న జరగనున్న, సంధ్యా మెరైన్స్ వైజాగ్ మారథాన్ 4 వ సంచిక (మన వైజాగ్ – మన మారథాన్) కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీ-షర్ట్ మరియు మెడల్‌ను నవోటెల్ నాటికా హాల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి GVMC కమిషనర్ శ్రీ కెతన్ గార్గ్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యం, ఐక్యత, మరియు సమాజ స్ఫూర్తిని ప్రోత్సహించే ఈ వేడుకలో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫిట్నెస్ ప్రియులు పాల్గొన్నారు.
సంస్థ ప్రెసిడెంట్ శ్రీ బాలకృష్ణ రాయ్ మాట్లాడుతూ, మాదకద్రవ్య రహిత మరియు పర్యావరణ అనుకూల విశాఖను ప్రోత్సహించడమే మారథాన్ లక్ష్యమని తెలిపారు. ప్రతి ఎడిషన్ టీ-షర్ట్ రంగులు ప్రకృతి యొక్క ఐదు మూలకాలను ప్రతిబింబిస్తున్నాయని వివరించారు:
తెలుపు – గాలి (1వ ఎడిషన్)
నీలం – నీరు (2వ ఎడిషన్)
నారింజ – అగ్ని (3వ ఎడిషన్)
ఆకుపచ్చ – భూమి (4వ ఎడిషన్)
“ఆనందం పొందడానికి లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి మాదకద్రవ్యాలు అవసరం లేదు. ఒక మంచి పరుగే మన మనసును శుభ్రపరచి సహజ ఉల్లాసాన్ని కలిగిస్తుంది. మాదకద్రవ్య రహిత విశాఖ కోసం పరుగెత్తడం ప్రారంభిద్దాం.” అని ఆయన పిలుపునిచ్చారు.
“ఈ సంవత్సరం విశాఖ ప్రజల హృదయాల్లో దశాబ్దాలుగా స్థిరంగా ఉన్న ఆధ్యాత్మిక గిరి ప్రదక్షిణ సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని, 20 మైలర్ (32K) కేటగిరీని ప్రవేశపెడుతున్నాం అని ప్రకటించారు. నగరవాసులు గిరిప్రదక్షిణ ని ఎలా విజయవంతంగా పూర్తి చేస్తున్నారో, అదే స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు
💪 సమాజ ఆరోగ్య కార్యక్రమాలు
విశాఖ నగరమంతటా ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు:
ప్రొఫెషనల్ కోచ్ ద్వారా ఉచిత శిక్షణ, కొత్త వాళ్లలో ఉత్సాహం నింపటంకోసం ప్రతినెలా క్లబ్ రన్ నిర్వహిస్తున్నామని ఇందులో పాల్గొని అనుభవజ్ఞుల ద్వారా మెళుకువలు తెలుసుకోవచ్చని తెలిపారు
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మరియు స్పాన్సర్లు:
శ్రీ కె ఆనంద్ – టైటిల్ స్పాన్సర్, సంధ్యా మెరైన్స్
డా. కృష్ణ ప్రసాద్ – COO, అపోలో హాస్పిటల్స్, అరిలోవ
శ్రీ ప్రభు కిషోర్ వల్లూరుపల్లి & శ్రీమతి లక్ష్మి – హాస్పిటాలిటీ పార్ట్నర్స్, నవోటెల్
శ్రీ ప్రద్యుమ్న – GM, క్వాలిటీ కంట్రోల్, డివిస్ లాబ్స్
శ్రీ రవి కట్టా – సైట్ క్వాలిటీ హెడ్, ఫైజర్
శ్రీ TVN సత్య మూర్తి – టాటా కాపర్ ప్రతినిధి
సెక్రటరీ శ్రీ కంచేటి శ్రీనివాస్ మాట్లాడుతూ:
సంధ్యా మెరైన్స్కు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే CMR, నవోటెల్, అపోలో హాస్పిటల్స్ మరియు మెంటల్ హెల్త్ అవేర్నెస్ కోసం మాతో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ మద్దతుతో ఈ మ్యారథాన్ మునుపటి మూడు సంచికలకంటే ఈసారి మరింత విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు
📅 మారథాన్ వివరాలు
తేదీ: నవంబర్ 30, 2025
పరుగుల కేటగిరీలు: 5K, 10K, 21K, 32K
📍 మార్గ విశేషాలు
పార్క్ హోటల్ జంక్షన్ వద్ద ప్రారంభమై, అక్వేరియం, రోప్‌వే, ఫిలింనగర్ క్లబ్ వద్ద యూ-టర్న్ తీసుకుని, VMRDA పార్క్ వద్ద ముగుస్తుంది.
అపోలో హాస్పిటల్స్ వారు ప్రతి 2 కిలోమీటర్లకు వైద్య బృందాలను ఏర్పాటు చేస్తారు అని తెలిపారు.
📝 నమోదు వివరాలు
చివరి తేదీ: నవంబర్ 15, 2025
ఆన్లైన్: www.vizagmarathon.run
ఆఫ్‌లైన్: PUMA స్టోర్, VIP రోడ్
🤝 అందరికీ ఆహ్వానం
విశాఖ రన్నర్స్ సొసైటీ కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు మరియు వ్యక్తులు అందరూ కలసి ఈ 4వ ఎడిషన్ మారథాన్ ను విజయవంతం చేయాలని సొసైటీ సభ్యులు కోరారు . అందరి భాగస్వామ్యం ద్వారా మనం ఫిట్నెస్ విశాఖ, ఈకో విశాఖ, డ్రగ్-ఫ్రీ విశాఖ అనే లక్ష్యాలను సాధించగలమని తెలిపారు.
కలసిరండి,- పరుగెత్తండి , ఆరోగ్యవంతమైన విశాఖ కోసం ముందుకు సాగండి!
విశాఖ రన్నర్స్ సొసైటీ