ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతం
-దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జిల్లా అధ్యక్షులు, గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం
ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతం అయ్యింది అని గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీలోని ఆ హబ్ లో ప్రకృతి ఆధారిత పంటల సంత నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారిత పంటలను మాత్రమే ఆహారం గా తీసుకోవడం మంచిదని అన్నారు. ఈ ప్రకృతి ఆధారిత పంటల సంత ప్రతి ఆదివారం ఇక్కడే జరుగుతుందని వివరించారు. ప్రకృతి ఆధారత పంటలను కోరుకునే వారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతులకు, నగరం లోని వినియోగదారులకు ఇది ఒక వేదికగా అవకాశం కల్పించడం జరిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు రైతులకు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం బెంగళూరు వంకాయ మొక్కలు పంపిణీ చేయడం ఆనందదాయకం అన్నారు. రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు వినియోగించకుండా పండిన పంటలను ప్రోత్సాహం విధించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి పాలేం నేచురల్స్ అశోక్, రైతులు రిషీ, తులసీ నేచురల్స్ సత్యన్నారాయణ, సంకల్ప ఆర్ట్ విలేజ్ నుంచి చలపతి రావు, అవని ఆర్గానిక్స్ నుంచి ఉషాగజపతి రాజు, శ్రీకాకుళం జిల్లా నుంచి దార్లపూడి రవి, వనమాలి, సిటిజి, మన కూరగాయల తోట సంస్థల ప్రతినిధులు, విభిన్న జిల్లాల రైతులు పాల్గొన్నారు.
ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతం ! #vvwnews
15
previous post