విజయ మెడికల్ సెంటర్‌తో  న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ భాగస్వామ్యం ! #vvwnews

by vvwnews.com

విజయ మెడికల్ సెంటర్‌తో  న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ భాగస్వామ్యం

విశాఖపట్నం:-
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డయాగ్నోస్టిక్ చైన్లలో ఒకటైన న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, వైజాగ్ లో  ప్రధాన కార్యాలయం కలిగిన విజయ మెడికల్ సెంటర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవటం ద్వారా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో తమ కార్యకలాపాలను  విస్తరించింది. ఈ భాగస్వామ్యం తెలుగు రాష్ట్రాల్లో న్యూబెర్గ్ యొక్క కార్యకలాపాలను విస్తృతం చేయటంతో పాటుగా, న్యూబెర్గ్ యొక్క ప్రపంచ నైపుణ్యాన్ని మరియు విజయ యొక్క 40 సంవత్సరాల విశ్వసనీయ ప్రాంతీయ వారసత్వాన్ని మిళితం లోచేస్తోందని ఈ సందర్భంగా న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్
డాక్టర్ జిఎస్ కే వేలు, విజయ మెడికల్ సెంటర్ డైరెక్టర్, రేడియాలజీ చీఫ్ డాక్టర్ సుమన్ కలగర
తెలిపారు. పాథాలజీ, రేడియాలజీ మరియు నివారణ ఆరోగ్య సేవలను విస్తృత శ్రేణిలో వేగవంతమైన, మరింత ఖచ్చితమైన, నమ్మదగిన ఫలితాల నుండి రోగులు  ప్రయోజనం పొందేలా ఈ ఏకీకరణ చేస్తుందన్నారు.
విజయ మెడికల్ సెంటర్‌ను 1985లో నలుగురు దేశీయ వైద్యులు ఆధ్వర్యంలో ప్రారంభించామన్నారు.
40 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. వైజాగ్‌లోని హెల్త్ సిటీలో 150,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన కార్యాలయం కలిగిన విజయ మెడికల్ సెంటర్, భారతదేశంలో అతిపెద్ద స్వతంత్ర ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సౌకర్యం అని చెప్పారు. ఈ కేంద్రం విస్తృత శ్రేణిలో పాథాలజీ, రేడియాలజీ, మాలిక్యులర్ ఇమేజింగ్ మరియు ప్రివెంటివ్ వెల్‌నెస్ సేవలను ఒకే చోట అందిస్తుందన్నారు.
ఈ నూతన ఒప్పందం ప్రకారం
తమ సేవలను మరింత విస్తృతం చేస్తూ, పునరుత్పత్తి , వారసత్వ జన్యుశాస్త్రం, ఆంకాలజీ పాథాలజీ, ట్రాన్స్‌ప్లాంట్ ఇమ్యునాలజీ, జినోమిక్స్, ప్రోటీమిక్స్ మరియు రిటైల్ హెల్త్ చెక్ అప్‌లతో సహా అధునాతన మాలిక్యులర్ మరియు జెనెటిక్ టెస్టింగ్ సామర్థ్యాలను న్యూబెర్గ్ పరిచయం చేయనుందన్నారు.
 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని 8 నగరాల్లో 18 ప్రదేశాలలో విజయ కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. విశాఖపట్నం లో 10 ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను విజయ కలిగి ఉందన్నారు.  తెలుగు రాష్ట్రాలలోని 10 నగరాల్లో,  హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, విజయవాడ, నరసరావుపేట, భీమవరం, నెల్లూరు మరియు గుంటూరులలో,  పాథాలజీ సేకరణ కేంద్రాలతో పాటు ఏపీ & తెలంగాణ అంతటా పాథాలజీ లేబరేటరీలను న్యూబెర్గ్ కలిగి ఉందని, ఈ నగరాల్లో ఈ రెండు సంస్థలూ నిర్వహిస్తోన్న కార్యకలాపాలు రాబోయే 60 రోజుల్లో విజయ మెడికల్ సెంటర్ బ్రాండ్ పేరిట విలీనం చేయబడతాయన్నారు. ఈ భాగస్వామ్యం రాబోయే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని 59 జిల్లాల్లో ప్రత్యక్ష డయాగ్నోస్టిక్స్ కార్యకలాపాలను నిర్వహించాలని యోచిస్తోందన్నారు.
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ డయాగ్నోస్టిక్ నెట్‌వర్క్‌లలో ఒకదాన్ని సృష్టించడం, అన్ని రాష్ట్రాలు,  పట్టణాలలో విస్తరించడం అనే న్యూబెర్గ్ ప్రయాణంలో ఈ భాగస్వామ్యం ఒక కీలక మైలురాయి అని, న్యూబెర్గ్ యొక్క అత్యాధునిక ప్రపంచ సాంకేతికత , ఏఐ ఆధారిత ఐటి కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లోని విజయ యొక్క బలమైన స్థానిక వారసత్వంతో మిళితం చేయటం ద్వారా, ఈ ప్రాంతం యొక్క డయాగ్నోస్టిక్ వాతావరణంను పునర్నిర్వచించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ ప్రతినిధులు సందీప్ షా, శ్రీ గణేశన్, కావ్య, విజయ మెడికల్ సెంటర్ డైరెక్టర్లు డాక్టర్ సుమన్ కలగర, డాక్టర్ మదన్ కలగర, డాక్టర్ సూర్యనారాయణ కొప్పాక, మరియు డాక్టర్ సత్యనారాయణ ఎం.టి.వి.వి తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles