డ్రోన్లు సహాయంతో హరిత విశాఖ సాధిద్దాం.
– స్వచ్ఛమైన గాలి మన లక్ష్యం కావాలి
– జీవ వైవిద్య పరిరక్షణకు అనువైన వనాలు పెంచాలి
– దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలి
– డివి రమణమూర్తి, అదనపు కమిషనర్, జివిఎంసి
డ్రోన్లు సహాయంతో విత్తనాలు జల్లి హరిత విశాఖ సాధిద్దాం అని జివిఎంసి అదనపు కమిషనర్ డివి రమణమూర్తి పిలుపునిచ్చారు. స్వచ్చంద్ర స్వర్ణాంధ్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పార్క్ లో స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మొక్కలు నాటిన అనంతరం కొండల మీద డ్రోన్లు సహాయంతో సమస్త జీవరాసకి ఆహారాన్ని ఇచ్చే, పక్షులు గూళ్ళు పెట్టుకునే, ఔషధ గుణాలు ఉన్న, దేశీయ కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు జల్లిన తర్వాత ఆయన మాట్లాడారు. స్వచ్ఛమైన గాలి మన లక్ష్యం కావాలన్నారు. జీవ వైవిద్య పరిరక్షణకు అనువైన వనాలు పెంచాలని కోరారు. దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలి అన్నారు.
స్వచ్చాంధ్రా స్వర్ణాంధ్రలో భాగంగా జీవీఎంసీతో కలసి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం నేతృత్వంలో తెల్ల వంగ, నల్ల వంగ, పచ్చిమిర్చి ,టమాటా , బంతి నారు రెండు లక్షల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో సగం ప్రభుత్వ వసతి గృహాలకు అందజేయడం జరిగింది. 25 వేల రూపాయల దేశీయ కూరగాయ విత్తనాలు కొండలపై చల్లడానికి అందజేయడం జరిగింది,
గో ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రమణ్య వర్మ 300 కిలోల అడవి జాతి విత్తనాలు అందజేయడం జరిగింది. సెయింట్ జోసఫ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జ్ఞానాపురం వారు 30 వేల సీడ్ బాల్స్ ఇవ్వడం జరిగింది. మిషన్ గ్రీన్ భీమిలి 25000 సీడ్ బాల్స్ ఇవ్వడం జరిగింది. ఎపి పిసిబి, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వారు అందజేసిన గుడ్డ సంచులు 400 పంపిణీ చేశారు.
జివిఎంసి తో కలిసి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ, మిషన్ గ్రీన్ భీమిలిల నేతృత్వంలో భీమిలి కొండల మీద డ్రోన్ల సహాయంతో అడవి జాతి మొక్కల విత్తనాలు, దేశీయ కూరగాయ, ఆకుకూరల మొక్కల విత్తనాలు వేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిఎం ఒ డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్, టిడిపి నాయకులు గంటా నూకరాజు, జివిఎంసి ఇంజనీరింగ్ అధికారులు, ఎస్ ఆర్ యు-జివిఎంసి ప్రోజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రాజమణి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ ప్రతినిధులు జెవి రత్నం, రాజేశ్వరి, మిషన్ గ్రీన్ భీమిలి ప్రతినిధి డాక్టర్ ఆదిత్య, విభిన్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్రోన్లు సహాయంతో హరిత విశాఖ సాధిద్దాం.- స్వచ్ఛమైన గాలి మన లక్ష్యం కావాలి
13