కాపుల వనభోజన మహోత్సవం విజయవంతం చేయండి*#vvwnews

by vvwnews.com

*కాపుల వనభోజన మహోత్సవం
విజయవంతం చేయండి*

*ముడసర్లోవ వేదికగా నిర్వహణ*

*కాపులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిందే*

డాబా గార్డెన్స్ అక్టోబరు 11

విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న కాపుల వనభోజన మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దిం శెట్టి సురేష్ ,.ఎర్రంశెట్టి సురేష్ లు తెలిపారు.. శనివారం ఇక్కడ డాబా గార్డెన్స్ వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో వీరు వనభోజన మహోత్సవానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.. ముడసర్లోవ పార్క్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాపులందరినీ ఒకే చోటకు చేర్చాలని ఒక మంచి సంకల్పంతో 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. రాజకీయాలతో సంబంధం లేదని ఈ వనభోజన మహోత్సవానికి అందర్నీ ఆహ్వానించనున్నట్లు వీరు చెప్పారు. ఆరోజు ఉదయం నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు , ఆటలు పోటీలు ,విందు భోజనం , అతిథులు ప్రసంగాలు ఉంటాయ న్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ..డాక్ యార్డ్ కేటిబి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కాపులు అందరూ సమిష్టిగా ముందుకు సాగితేనే అన్నింట తగిన ఆదరణ లభిస్తుందన్నారు.. అందుకోసం ఇటువంటి వనభోజనం మహోత్సవ కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాపుల సంక్షేమానికి పెద్దపేట వేయాలని ఆకాంక్షించారు.. ప్రతి ఏటా వనభోజనం మహోత్సవానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని ఈ ఏడాది కూడా వేలాది మంది వచ్చే అవకాశం ఉందని కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అందరూ బాగుండాలి ..అందులో మనం ఉండాలి,, అందరూ ఒకే చోట కలుసుకొని ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడానికి వనభోజన మహోత్సవాలు ఉపకరిస్థాయ న్నారున్నారు..క్రమం తప్పకుండా వనభోజనం మహోత్సవం నిర్వహిస్తున్న విశాఖ కాపు యూత్ వెల్ఫేర్అసోసియేషన్ ను
గంట్ల శ్రీనుబాబుప్రశంసించారు.. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ దొరబాబు, కోశాధికారి ఎస్ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు రాము ..సుహాస్.
. జి శ్రీనివాసరావు. కనకారావు తదితరులంతా పాల్గొన్నారు .
వనభోజనం మహోత్సవానికి సంబంధించిన గోడ పత్రిక ఈ సందర్భంగా వీరంతా ఆవిష్కరించారు

Use Social Media to Spread the Word about Our News

related articles