సిఐటియు 18వ అఖిలభారత మహాసభల లోగో పోస్టర్ ఆవిష్కరణ. #vvwnews

by vvwnews.com

ప్రెస్ నోట్
సిఐటియు 18వ అఖిలభారత మహాసభల లోగో పోస్టర్ ఆవిష్కరణ.
సిఐటియు అఖిలభారత మహాసభలు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో 2025 డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ 2026 వరకు జరుగుతున్నాయి. మహాసభల లోగోను ఈరోజు జగదాంబ సిఐటియు ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 70 లక్షల మంది కార్మికుల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1500 మంది ప్రతినిధులు 29 రాష్ట్రాల నుండి హాజరవుతున్నారన్నారు. ఈ మహాసభలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చలు జరిపి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను మార్పు చేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చిందన్నారు. ఫలితంగా కార్మికుల సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసుకునే హక్కు జీతభత్యాలు బేరం ఆడుకునే హక్కులు వంటి ప్రాథమికమైన కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ చట్టం చేసిందన్నారు. దీనిని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ లన్నింటినీ కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధరాధత్తం చేయడం అన్యాయం అన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సిఐటియు మహాసభలు జరుగుతాయన్నారు. సిఐటియు ఏర్పడ్డ 55 సంవత్సరాల కాలంలో మొదటిసారి అఖిలభారత మహాసభలు విశాఖ నగరంలో జరుగుతున్నాయని దీనికి ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహాసభల చివర రోజైన జనవరి 4వ తేదీన లక్ష మందితో భారీ కార్మిక ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందన్నారు. మహాసభల సందర్భంగా రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు, ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తా మన్నారు. ఈ మహాసభల జయప్రదానికి విశాఖ నగర లో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలు, శ్రేయోభిలాషులు, మేధావులు, అభ్యుదయ వాదులు మీయొక్క ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్, జిల్లా కోశాధికారి జ్యోతిశ్వరరావు, జిల్లా కార్యదర్శి లు పి.మణి , బి జగన్, ఉపాధ్యక్షులు కుమార్ మంగళం, ఆర్ఎస్ ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
Rksv.కుమార్
ప్రధాన కార్యదర్శి
సిఐటియు 18 అఖిలభారత మహాసభల నిర్వహణ కమిటీ.

Use Social Media to Spread the Word about Our News

related articles