నమో నరసింహ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి

by vvwnews.com

*నమో నరసింహ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం
శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం అందు
*శ్రీశ్రీశ్రీ స్వామి వారి సహస్రనామార్చన***
””””””””””””””””””””””””””””’
శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మినృసింహ స్వామి వారి దేవస్థానం,
సింహాచలం(విశాఖపట్నం)*
*తేదీ: 11-10-2025*
———————————
శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి *సహస్రనామార్చన* నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపం లో అధిష్టింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనమునకు అనుమతించారు.
“”””””””””””””””””””””””””””””””””””‘”””

సదా స్వామివారి సేవలో
కార్యనిర్వహణాధికారి
సింహాచలం దేవస్థానం విశాఖపట్నం
“”””””””””””””””””””””””””””””””””””””””

Use Social Media to Spread the Word about Our News

related articles