*6/10/2025 నిన్నటి రోజున*
*పార్వతీపురం నియోజకవర్గం
*రెవెన్యూ పరమైన సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి ఈ రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు*
*పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర*
*కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర*
ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూపరమైన సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగిందని పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం పార్వతిపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దశాబ్దాల నుంచి రెవెన్యూపరమైన సమస్యలు ఎన్నో పేరుకుపోయాయని, రెవెన్యూ పరమైన సమస్యలు ఏవైనా ఉంటే ఈ రెవెన్యూ క్లినిక్ ల ద్వారా పరిష్కారం జరుగుతుందని అన్నారు. తాసిల్దార్ సబ్ కలెక్టర్ వంటి అధికారులతో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎవరికైతే భూమి ఉందో ఆ భూమి వారిది కాదు, ఎవరికైతే స్థలం ఉందో ఆ స్థలం వారిది కాదు.. ఇలా అనేక రకాలుగా ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురి చేశారన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో, మున్సిపాలిటీలో, పార్వతీపురం నియోజకవర్గం లో రెవెన్యూ పరంగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారందరికీ న్యాయం చేసే దిశగా ఈ రెవెన్యూ క్లినిక్ లు పనిచేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా నుంచి మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగిందని, మన జిల్లా అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేయాలని అధికారులను సూచించారు. రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కారానికి ఒక అద్భుతమైన క్లినిక్ ను తయారుచేసిన కలెక్టర్, సబ్ కలెక్టర్, రెవెన్యూ జిల్లా అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, తదితరులు పాల్గొన్నారు.