ఇంద్రకీలాద్రి,
కొనసాగుతున్న భవానీ భక్తులరద్దీ
దసరా ఉత్సవాలు పురస్కరించుకొని ఇంద్రకీలాద్రికి విచ్చేస్తున్న భవానీ భక్తులరద్దీ కొనసాగుతుంది.
శనివారం ఉదయం 2 గంటల నుండి అమ్మవారి దర్శనం కొరకు ప్రధాన ఆలయం తెరచినా, సాయంత్రం వరకు అదే రద్దీ నడుస్తుంది.
హోల్డింగ్ ఏరియా నుండి వినాయక టెంపుల్ మీదుగా ఘాట్ రోడ్ నుండి భక్తులు కొండ పైకి చేరుతున్నారు.
సాయంత్రం హరతులుకు దర్శనం ఆపే సమయానికి 1,27,996 మంది భక్తులు దర్శించుకున్నారు.
రాత్రి వరకు ఇదే రద్దీ ఉండొచ్చు అని భావిస్తున్నాము.
అమ్మవారి దర్శనం, మహా మండపం దిగువున మాల విరమణ ఏర్పాటు, అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం నిమిత్తం ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు.
ఉత్సవాల ముగింపు సమయం లో భావానీల రద్దీ ఎప్పుడు ఉన్నా, ఈ సంవత్సరం మరింతగా భక్తులసంఖ్య పెరిగింది.
భక్తుల రద్దీ తగ్గట్టు అన్న ప్రసాదం, లడ్డు ప్రసాదం కొనసాగిస్తున్నట్లు, ఒక్కో భక్తునికి 12 లడ్డులు గల (6+6) బాక్స్ లు ఇస్తున్నట్లు, మూడు లడ్డు తయారు కేంద్రాలు వినియోగిస్తున్నట్లు ఈవో తెలిపారు.