సంస్కృతి,సంప్రదాయాలు,నీతి కధలు,ఇతిహాసాలు నేటి తరానికి అర్ధమయ్యే రీతిలో బొమ్మల కొలువు ఏర్పాటు

by vvwnews.com

సంస్కృతి,సంప్రదాయాలు,నీతి కధలు,ఇతిహాసాలు నేటి తరానికి అర్ధమయ్యే రీతిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం అభినందనీయమని విశాఖ ఉత్తర నియోజక వర్గ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామలా దీపిక అన్నారు.విశాఖపట్నం శంకర మఠంలో తల్లాప్రగడ మాణిక్య లక్ష్మి మనోరమ ఏర్పాటుచేసిన బొమ్మల కొలువును బుధవారం పలువురు ప్రముఖులు సందర్శించి నిర్వాహకులను కొనియాడారు.ఈ సందర్భంగా శ్యామలా దీపిక మాట్లాడుతూ దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన బొమ్మల కొలువులో వివిధ వృత్తుల, రాజుల, దేవతల, పురాణాల పాత్రలను ప్రతిబింబించే బొమ్మలతో అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు.బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శంకర మఠంలో ఏర్పాటుచేసిన బొమ్మల కొలువులో కొలువుదీరిన బొమ్మలు ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నారు.వివిధ వృత్తుల, దేవతల, చారిత్రక సంఘటనలు ఈ బొమ్మల ద్వారా కనిపిస్తాయన్నారు.పురాణ గాథలను నేటి తరానికి సులభంగా అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దిన బొమ్మల కొలువు అత్యద్భుతంగా ఉందని కొనియాడారు.నిర్వాహకురాలు తల్లాప్రగడ మాణిక్య లక్ష్మి మనోరమ మాట్లాడుతూ స్వామివారి ఆదేశాల మేరకు శ్రీశ్రీశ్రీ దేవి నవరాత్రుల సందర్భంగా విశాఖపట్నం శంకర మఠంలో బొమ్మల కొలువు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.సాంప్రదాయ బద్దంగా,చూడచక్కని బొమ్మలతో,క్రమపద్ధతిలో అందంగా అనేక బొమ్మలతో బొమ్మల కొలువు తీర్చిదిద్దినట్లు తెలిపారు.నవరాత్రుల సందర్భంగా శంకర మఠంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని లలితా పారాయణ చేసారు.

Use Social Media to Spread the Word about Our News

related articles