రానున్న రోజుల్లో కార్యకర్తలకే పెద్దపీట,మా కార్యకర్తలను వేధిస్తే.. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం!#vvw

by vvwnews.com

#AdminPost

తేదీ:29/09/2025
భీమిలి నియోజకవర్గం

భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పత్రిక సమావేశం..
రానున్న రోజుల్లో కార్యకర్తలకే పెద్దపీట,మా కార్యకర్తలను వేధిస్తే.. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం!

భీమిలి అసెంబ్లీ నియోజవర్గం ఎండాడ విశాఖ వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ పోస్టర్ ను ఆవిష్కరించిన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చిన్న శ్రీను గారు.

ఈరోజు భీమిలి అసెంబ్లీ నియోజవర్గం ఎండాడ విశాఖ వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో అందు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక సమావేశం నిర్వహించిన *గౌరవ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ ,జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు( చిన్న శ్రీను)గారు* నిర్వహించారు..
అనంతరం అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో చిన్న శ్రీను గారు మాట్లాడుతూ..
వైసీపీలో ఇకపై కార్యకర్తలకే పెద్దపీట ఉంటుంది.కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది.ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈ రోజు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్‌లో చర్యలు ఖాయం.

ఎవరికి అన్యాయం జరిగినా ‘డిజిటల్‌ బుక్‌’లో నమోదు చేస్తున్నాం. అధికారంలోకి రాగానే అందరిపై చట్టపరంగా చర్యలు ఉంటాయి…

ఈ ప్రభుత్వంలో బాధితులు ఎవరైనా సరే ‘‘డీబీ.డబ్ల్యూఈవైఎస్‌ఆర్‌సీపీ.కామ్‌’’ https://digitalbook.weysrcp.com అనే వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చు. అదే విధంగా 040–49171718 నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయచ్చు. పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచేందుకు.. డిజిటల్ బుక్ తీసుకొచ్చిన వైయస్ఆర్ సీపీ వైయస్ జగన్ గారి చేతుల మీదుగా డిజిటల్ బుక్ ప్రారంభం

ప్రజాసంక్షేమాన్ని విస్మరించి కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి.

ఈ కార్యక్రమంలో ..
మాజీ శాసనసభ్యులు తైనాల విజయకుమార్ గారు, చిన్న శ్రీను గారి కుమార్తె మజ్జి సిరి సహస్ర(సిరమ్మ)గారు,భీమిలి నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు,ఎంపీపీలు, జడ్పిటిసిలు,వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు,ముఖ్య నాయకులు కార్యకర్తల పాల్గొన్నారు.

#bheemiliacincharge
#𝐂𝐇𝐈𝐍𝐍𝐀𝐒𝐑𝐈𝐍𝐔
#TeamChinnaSrinu
#majjisrinivasarao

Use Social Media to Spread the Word about Our News

related articles