సింహాచలం దేవస్థానం గిరి ప్రదర్శన రోజు రాష్ట్రంAP సెలవు ప్రకటించాలి అని పాసర్ల ప్రసాద్ విజ్ఞప్తించారు

by vvwnews.com

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గిరి ప్రదక్షణ ఉత్సవాన్ని అతి వైభవంగా నిర్వహించినందుకు విశాఖ జిల్లా కలెక్టర్ గారైన హరేంద్ర ప్రసాద్ గారికి, సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి గారికి, ముఖ్యంగా పోలీస్ కమిషనర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ 26 విభాగాల అధికారులకు, ఉద్యోగులకు ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి, విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ గారికి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉత్సవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, తెలంగాణలో మేడారం జాతర లాగా, వినాయక నిమజ్జనం లాగా రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి తగిన ఫండ్ ఇచ్చి రెండు రోజులు సెలవు ప్రకటించి విశాఖ సిటీలో ఇంకా వైభవంగా మరిన్ని వసతులతో చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా సింహాచలం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనజీవనం స్తంభించిపోయింది కాబట్టి తక్షణమే మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచిన సింహాచలం జంక్షన్ నుంచి చెరువు పక్క నుంచి, విజినిగిరి పాలెం, లండగరువు, రామన్న చెరువు పక్క నుంచి AMG దగ్గర వరకు వెళ్లే 60 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.- పాశర్ల ప్రసాద్, మాజీ సర్పంచ్, అడవివరం.

Use Social Media to Spread the Word about Our News

related articles