హరే కృష్ణ మూవెమెంట్: విశాఖపట్నం
సింహాచలం గిరి పరిక్రమ లో అఖంద హరినామ సంకీర్తన
హరే కృష్ణ మూవెమెంట్ విశాఖపట్నం భక్తులు 20 వ తేదీ జులై 2024 సింహాచలం గిరిపరిక్రమలో భక్తుల కోరిక మేరకు అఖంద హరినామ సంకీర్తన నిర్వహించడం జరిగింది .
20 వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సింహాచలం నుంచి సింహాచల అప్పన్న స్వామి రథము వెంట హరే కృష్ణ మూవెమెంట్ వారి రథము అప్పన్న స్వామి వారి ఫోటో అలంకరణతో బయలు దేరినారు .
గిరిపరిక్రమ లో భక్తులు నడు చుంన్నాము అనే కష్టము తెలియ కుండా అఖంద సంకీర్త నిర్వహించడం జరిగింది .
ఈ హరినామ సంకీర్తనలో భక్తులు ఉత్సహంగా వివిధ రకాల సంగీత వాయిద్యాలు మృదంగం , కార్తల్, డప్పులు మొదలగున్నవి ఉపయోగిస్తూ హరినామ సంకీర్తనతో నాట్యాలతో జరిగింది . దీనిలో పాల్గున్న భక్తులు భక్తి తో తన్మయము చెందినారు . దేనిని మంచి అనుభూతిగా తెలిపినారు .
ఈ కార్య క్రమము శ్రీ మాన్ నిష్క్రించిన భక్త దాస ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ వారి అద్వర్యం లో నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రములో శ్రీ యదురాజదాస , శ్రీ అంబరీష దాస, శ్రీ శృతి సాగర దాస మరియు హరే కృష్ణ మూవ్మెంట్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గున్నారు .
శ్రీకృష్ణచైతన్యమహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణభగవానుడే. హరినామ సంకీర్తన ప్రచారం ద్వారా దేవాది దేవ భగవానుడి యెడల శరణాగతి భావాన్ని జనబాహుళ్యంలో పెంపొందించే లక్ష్యంతో వారు భక్తులు రూపంలో అవతరించినారు. దేవాదిదేవుని యెడల ప్రేమభావాన్ని పెంపొందించడానికి పవిత్రమైన హరినామ సంకిర్తనమును వ్యాప్తిచేసే లక్ష్యంతో వారు దేశవ్యాప్తంగా పర్యటించినారు.
ప్రస్తుత సమాజంలో కుల, మత, జాతి, ప్రాంత, లింగ బేదాలతో కలియుగంలో గొడవలు పెట్టుకుంటు ప్రశాంతత లేకుండ వుంటున్నారు. ఈ తరుణంలో శ్రీ ఏ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు 1960 లో ఈ సంకీర్తనాన్ని విశ్వవ్యాప్తి చేసారు. వీరు చెప్పిన ఒకే మంత్రముతో ప్రపంచములోని అన్ని దేశాలవారు తమతమ ప్రాంత, కుల, లింగ బేదాలను మరచి హరే కృష్ణ జప యజ్ఞం తో సంకీర్తన నిర్వహించి ప్రశాంతత పొందగలుగు చున్నారు .
అద్యాత్మిక అవగాహన లేకపోవడం కారణంగా ప్రపంచ ప్రజలలో ప్రశాంతత లేకుండా తెలియని మానసిక వొత్తిల్లకు లొను అవుతున్నారు. ఈ హరినామ సంకీర్తన లు కారణంగా ప్రజలలో బేదాలు మరచి మనుషుల మద్య ఐక్యమత్యం వచ్చి ప్రశాంతత పొందకలుగుతారు.
ఇట్లు
శ్రీ యదు రాజ దాస
హరే కృష్ణ మూవ్మెంట్
విశాఖపట్నం