*ప్రమాదానికి గురై పూర్తిగా ముక్కలై ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఫిషింగ్ బోటు. ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారులు.*
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపలు వేట కోసం పూడిమడక వైపు వెళ్లిన *IND-AP-V5-MM-245 దూడ దాసు* కు చెందిన మెకానేజ్డ్ ఫిషింగ్ బోటు చేపల వేట చేస్తుండగా అప్పికొండ తీరం వద్ద ప్రమాదానికి గురైంది. సముద్రంలో అలలు తాకిది ఎక్కువగా ఉండటంతో ఫిషింగ్ బోటు తీరానికి కొట్టుకొని వచ్చింది. కెరటాల వద్దకు వచ్చేసరికి బోట్ లో నుంచి మత్స్యకారులు సముద్రంలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు రక్షించుకున్నారు. తీరం వద్ద అలల ఉధృతికి ఫిషింగ్ పోటు పూర్తిగా ఒక్క ముక్కలైంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగినప్పటికీ బోటు యజమానికి సుమారు *40 లక్షలు* విలువైన ఫిషింగ్ బోటు నష్టానికి గురవడంతో బోట్ యజమానికి జీవనాధారం లేకుండా పోయింది. బాధిత మత్స్యకార బోటు యజమానికి నష్టపరిహారం అందించే విధంగా మత్స్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా కోరుతామని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు *వాసుపల్లి జానకిరామ్* తెలిపారు.