*అనకాపల్లి జిల్లా పోలీసు*
*పత్రికా ప్రకటన*
*అనకాపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపీఎస్ గారు*
*చట్టాలను గౌరవిస్తూ చట్ట ప్రకారం పనిచేస్తాము: జిల్లా ఎస్పీ.*
*జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దారుల సమస్యలు తీర్చేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటాం: జిల్లా ఎస్పీ*
*అనకాపల్లి, జూలై 17:* రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీల్లో భాగంగా విజయనగరం జిల్లా నుండి అనకాపల్లి జిల్లా ఎస్పీగా బదిలీ పై వచ్చి నేడు అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించారు.
అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపీఎస్ గారు 2014 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారిణి.
ఈ సందర్భంగా మీడియాతో జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపీఎస్ గారు మాట్లాడుతూ నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లా ప్రజలకు, పోలీసు శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని, గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మహిళలపై జరిగే నేరాల నిర్మూలన, మహిళా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సహకారంతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని ఇందుకు పోలీస్ అధికారులు, మీడియా సహకారం అందించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ బి.విజయభాస్కర్, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ ఎస్.అప్పలరాజు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ కె.వి.సత్యనారాయణ,
ఎస్.బి డీఎస్పీ శ్రీ బి.అప్పారావు, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీ పి.నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణ మూర్తి, చంద్రశేఖర్, అప్పలనాయుడు, గణేష్, కుమారస్వామి, మన్మధరావు, సతీష్, నరసింహమూర్తి, సంజీవరావు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
*జిల్లా పోలీసు కార్యలయం,*
*అనకాపల్లి.*