బహుజన్ సమాజ పార్టీ విశాఖపట్నం జోన్ -1 సమీక్ష సమావేశం “BSP రాష్ట్ర సమన్వయకర్త పూర్ణ చంద్రరావు”

by vvwnews.com

ఉత్తరాంధ్రలో వలస నేతలకు బుద్ధి చెబుతాం

– బీఎస్పీ రాష్ర్ట సమన్వయ కర్త పూర్ణ చంద్ర రావు

సీతమ్మ పేట (విశాఖ ఉత్తర):

గత సార్వత్రిక ఎన్నికలు సమయంలో
బీ ఎస్ పి కి ప్రజలు మంచి సేవలు అందించారు అని బీఎస్పీ రాష్ర్ట సమన్వయ కర్త జే. పూర్ణ చంద్ర రావు తెలిపారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో బుధవారం విశాఖ జోన్ 1 సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ, శ్రీకాకుళం ప్రజలు మంచివ్యక్తులు. ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులు వలస పక్షులు. అనకాపల్లి ఎం పీ గా సీఎం రమేష్ గెలిచారు. ఉత్తరాంధ్ర వెలమ వంటి నేతలు కడప లో పోటీ చేయగలరా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వలస రాజ్యం అమలు అవుతుంది. వలస రాజకీయ నాయకులు లేకుండా చేస్తాం అని స్పష్టం చేశారు. గతంలో విశాఖ ఎం పి లుగా గెలిచిన పురంధేశ్వరి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, సుబ్బ రామి రెడ్డి వంటి నేతలు స్థానికులు కాదు. టీడీపీ, వైసిపి పార్టీలు వలస నేతలకే టిక్కెట్లు ఇచ్చాయి. వైసిపి లో విజయ సాయి రెడ్డి, సుబ్బారెడ్డి ప్రాబల్యం పెరిగింది. డబ్బులు కూడా వలస నేతలే పంచాలి. బొత్స, ధర్మాన వంటి నేతలు కుటుంబ ప్రయోజనాలు కోసమే పని చేసారు. బడుగు బలహీనర్గాలు అసెంబ్లీ లో అడుగు పెట్ట లేదు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి నాలుగు సార్లు సీఎం గా సుపరిపాలన అందించారు. బడుగులకు రాజ్యాధికారం బీఎస్పీ పుణ్యమే. కాన్సిరాం సిద్ధాంతాలు అనుసరణీయం. టీడీపీ మేని ఫెస్టోలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తాం అన్నారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదన అన్నారు. రాష్ట్రంలో కుల గణన బదులు నైపుణ్య సర్వే చేస్తాం అన్నారు. దేశంలో 1951 లో బీసీలకు రిజర్వేషన్లు అమలు లోకి వచ్చాయి అన్నారు. సిఎం నీలం సంజీవ రెడ్డి హయాంలో బీసీ లకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. 1970 దశకంలో బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి. విద్య, ఉద్యోగాలు కోసమే రిజర్వేషన్లు ఉపయోగ పడుతుంది. బీసీ ప్రజలు బీఎస్పీ తో కలిసి రావాలి అని పిలుపు ఇచ్చారు. ఉత్తరాంధ్ర తో మార్పునకు శ్రీకారం చుట్టాలి అని కోరారు. ఎర్ర మట్టి దిబ్బలు వద్ద దోపిడీకి సన్నాహాలు అని వార్తలు వస్తున్నాయి. వైసిపి ప్రభుత్వం ప్రజల స్వేచ్చ హరించి అధికారం కోల్పోయింది. ఇది ప్రజల పోరాటం. కులాల మధ్య పోరాటం కాదు అన్నారు.

రాష్ర్ట అధ్యక్షుడు బీ. పరం జ్యోతి
మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ గణన చేయాలి అని డిమాండ్ చేశారు. ఇప్పటికే విజయ వాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

మీడియా సమావేశంలో బీఎస్పీ నాయకులు లకే రాజా రావు, ప్రకాశ రావు, సత్యం, తిరుపతి రావు, బాపయ్య, శివ ప్రసాద్, బోని కృష్ణ, చిన్నా రావు, ఎం.సుబ్రహ్మణ్యం, వేంకటేశ్వర రావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles