AISF అఖిల భారత విద్యార్థి సమాఖ్య “జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు”

by vvwnews.com

………….
ఆగస్టు 6వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు శాంతియుత నిరసనలు.

*రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20నుండి 30 తేది వరుకు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్లో నిద్రలు.

*రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలి.

*జీవో నెంబర్ 77 రద్దు చేయాలి.

*డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ విధానం రద్దు చేయాలి.

**విశాఖపట్నం* : ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లిపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్, సిపిఐ కార్యాలయం నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్ బాబు , జిల్లా కార్యదర్శి యు నాగరాజు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్ నిద్రలు నిర్వహిస్తున్నామని దీని ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలు పరిష్కారం కోసం ఆగస్టు 6 వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు శాంతియుత ధర్నాలు నిర్వహించి విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. అలాగే గత ఏడు సంవత్సరాలుగా విద్యార్థులకు అందవలసిన దుప్పట్లు , ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు ఇవ్వలేదని అలాగే తొమ్మిది నెలలుగా మెస్ చార్జీలు విడుదల చెయ్యకపోవడంతో విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంలో ఆ యొక్క వార్డెన్స్ విఫలమవుతున్నారని దీనివల్ల విద్యార్థుల అనారోగ్యానికి గురయ్యి వాళ్ల విద్యాభ్యాసం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రభుత్వ హాస్టల్ కు సొంత భవనాలు కేటాయించాలని మెనూ సక్రమంగా అమలు చేయాలని హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ వల్ల విద్యార్థులు కోరుకున్న కళాశాలలో సీట్లు పొందలేకపోతున్నారని కావున ఆన్లైన్ అడ్మిషన్స్ రద్దు చేయాలని అలాగే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యూనివర్సిటీలు ప్రక్షాళన చేసి వాటి యొక్క స్వయం ప్రతిపత్తి కాపాడాలని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్ పోస్టులతో పాటు ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వానికి చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కే. హేమానంద్, మధు, శివ,నాగేష్ పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles