విత్తన బంతులతో హరిత విశాఖ సాధ్యం
– మనం తినే పండ్ల విత్తనాలు అన్నీ మొక్కలుగా మొలవాలి
– విత్తన బంతులతో ఎకొ వైజాగ్ సాధ్యం.
– ప్రతీ విద్యార్థీ వెయ్యి విత్తన బంతులు తయారు చేయాలి
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ
విత్తన బంతులతో హరిత విశాఖ సాధ్యం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఎంవిపి కాలనీలోని ఎస్ వివి పి డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటి, విత్తనబంధులు తయారు చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. మనం ఆహారంగా తీసుకునే పండ్ల విత్తనాలతో విత్తన బంతులు తయారుచేసి వాటిని కొండల మీద మైదాన ప్రాంతాలలోనూ సముద్ర తీరంలోను వేయాలని కోరారు. విత్తన బంతులతోనే ఎకొ వైజాగ్ సాధ్యమన్నారు. ప్రతి విద్యార్థి కనీసం 1000 విత్తనబంతులు తయారుచేసి అవి మొక్కలు వచ్చేలా చేసి వాటిని పెంచాలన్నారు. ఎవరు చెట్లు నరకకుండా చూడాలని, పెరిగిన ప్రతి చెట్టు ఒక టన్నుకు పైగా ఆక్సిజన్ ఇస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలన్నారు. తమ విద్యార్థులంతా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రకృతి వనరులన్నీ కాపాడుకుంటూ మనుషులంతా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయకపోతే చాలా ప్రమాదం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ప్రతినిధి హాని, యాక్షన్ ఎయిడ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ కృష్ణకుమారి, గ్రీన్ క్లైమేట్ టీం వాలంటీర్లు రవితేజ రాజేశ్వరి, జివిఎంసి ఎస్ ఆర్ యు ప్రతినిధి మంగ రాజు, ఎన్సిసి ప్రోగ్రాం ఆఫీసర్ ఉషా కుమారి ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు రాణీ ప్రియాంక, అప్పారావు, పలువురు విద్యార్థులు మాట్లాడారు,
విత్తన బంతులతో హరిత విశాఖ సాధ్యము మనము తినే పండ్లు విత్తనాలు అన్ని మొక్కలుగా మొలవాలి
64