“AWAAZ” Visakhapatnam district committee 14th జులై 2024 పాలస్తీనా సంఘీభావ సదస్సు

by vvwnews.com

Edit with InShot: ప్రెస్ నోట్
*జూలై 14న పాలస్తీన సంఘీభావ సదస్సు*

గత ఎనిమిది వారాలుగా అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ గాజాలో సృష్టిస్తున్న మారణహోమంలో సుమారు 13వేలకు మందికి పైగా పాలస్తీనీయులు మరణించారు. వీరిలో మూడింట రెండొంతులు పిల్లలు, మహిళలే. అనేక వేలమంది క్షతగాత్రులు అయ్యారు. లక్షల మందిని ఇళ్ల నుండి తరిమేశారు. ఇళ్ళు, స్కూళ్ళు, ఆస్పత్రులు, చర్చిలు, మసీదులు అన్న విచక్షణ కూడా లేకుండా ఇజ్రాయిల్ సైన్యం, సెట్లర్ గ్యాంగులు, బుల్డోజర్లతో కూల్చి వేస్తున్నాయి. ఆఖరికి ఐక్యరాజ్యసమితి యొక్క సహాయక శిబిరాలను సైతం ధ్వంసం చేస్తున్నది. ఈ మారణ హెూమాన్ని యావత్తు ప్రపంచం ఖండించింది. తక్షణం ఈ క్రూర యుద్ధోన్మాదాన్ని ఆపాలని గొంత్తెత్తి నిరసిస్తున్నది. అయినా ఇజ్రాయిల్ అమెరికా అండదండలతో ఈ మారణ హెూమాన్ని కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో పాలస్తీనీయులకు మద్దతుగా తక్షణం ఇజ్రాయిల్ కాల్పులు విరమించుకోవాలని కోరుతూ ఆవాజ్ విశాఖపట్నం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జూలై 14 న జగదాంబ వద్ద గల సీఐటీయూ కార్యాలయం లో ఉదయం 10 గంటలకు జరుగుతుందని ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ ఎ ఆశ్రఫ్ తెలిపారు.
అల్లూరి విజ్ఞాన కేంద్రం లో శనివారం జరిగిన ఆవాజ్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. దీనిలో ప్రజలు, వామపక్ష అభ్యుదయ వాదులు, లౌకికవాదులు, శాంతి కాముకులు, కార్మికులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు ఎండి ఆయూబ్, కోశాధికారి కుజ్ కుహనా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అబ్దుల్ మునీర్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
A. A. ఆశ్రఫ్
ప్రధాన కార్యదర్శి

Use Social Media to Spread the Word about Our News

related articles