విశాఖ లో 50 లక్షల మొక్కలు నాటి పెంచండి
– 5 వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేద్దాం సహకరించండి.
– విత్తన బంతులతో విశాఖను హరిత వనం చేద్దాం స్పందించండి.
– మొక్కలు నాటి పెంచి ఎకొ వైజాగ్ ను విజయవంతం చేయాలి
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ
50 లక్షల మొక్కలు నాటి పెంచి 5 వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేద్దామని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం అన్నారు. శనివారం ఉదయం సీతమ్మధార లోని ఎస్ ఎఫ్ ఎస్ విద్యా సంస్థలో గ్రీన్ క్లైమేట్ టీం అందజేసిన పువ్వులు, ఔషధ మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. విత్తన బంతులతో విశాఖను హరిత వనం చేద్దామన్నారు.
ఎస్ ఎఫ్ ఎస్ విద్యా సంస్థ ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ విజయకుమార్ మాట్లాడుతూ భూగోళం మీద సమస్త జీవరాశినీ కాపాడవలసిన బాధ్యత మానవాళిదె అన్నారు. మన భూమి మీద సమస్త జీవరాశినీ మనమే కాపాడుకోవాలన్నారు. ప్రకృతి ఆధారిత పంటలు పండించిన ఆహారాన్నే ఆరగించాలన్నారు.
జి విఎంసి ఎస్ ఆర్ యు ప్రతినిధి అక్షత మాట్లాడుతూ మన విశాఖపట్నం లో అమలవుతున్న ఎకో వైజాగ్ లో బాగంగా మొక్కలు నాటి పెంచె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జివిఎంసి ఎస్ ఆర్ యు ప్రతినిధులు ప్రమీల, వివేక్ లు, ఏక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి, ఎస్ ఎఫ్ ఎస్ విద్యా సంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ శివ లక్ష్మి , జోసఫ్ నవీనా, బి జ్యోతి, ఫర్జానా బేగం, పలువురు విద్యార్థులు మాట్లాడారు
మన పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరూ 10 మొక్కలు వెయ్యాలి
60