మన ఏపీఎల్ సీజన్ 3 ఆరు టీములతో మరింత విజయవంతం అవుతుందని ఏపీఎల్ జెర్సీ విశాఖలో లాంచ్ అయింది

by vvwnews.com

ఫోటోలున్నాయి
..
ఏపీఎల్‌`3ని విజయవంతం చేయాలి
..
ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్‌ రెడ్డి
..
విశాఖలో ఆటగాళ్ల జెర్సీ, ట్రోఫీ లాంచింగ్‌
..
విశాఖపట్నం, న్యూస్‌లీడర్‌, జూన్‌ 28: ఈ నెల 30నుంచి జూల్కె 13వరకు నిర్వహించనున్నట్టు ఏపీఎల్‌`3 క్రికెట్‌ పోటీల్ని విజయవంతం చేయాలని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కార్యదర్శి ఎస్సార్‌ గోపీనాథ్‌ రెడ్డి కోరారు. ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) మూడో సీజన్‌ మ్యాచ్‌లకు సంబంధించి శనివారం నగరంలోని ఓ హోటల్‌లో జెర్సీ, ట్రోఫీ లాంఛింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గోపీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వైఎస్సార్‌ స్టేడియం`బీ గ్రౌండ్‌లో క్రీడాకారులు ప్రాక్టీస్‌తో సందడి చేశారని, ఏసీఏ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌ ఆదివారం నుంచి వచ్చే నెల 13వరకు జరుగుతుందన్నారు. పోటీల్లో రాయలసీమ కింగ్స్‌, కోస్టల్‌ రైడర్స్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌, గోదావరి టైటాన్స్‌, బెజవాడ టైగర్స్‌, వైజాగ్‌ వారియర్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జట్ల కెప్టెన్లు కె.ఎస్‌.భరత్‌, పి.గిరినాథ్‌రెడ్డి, సి.ఆర్‌.జ్ఞానేశ్వర్‌, ఎస్‌.కె.రషీద్‌, జి.గుల్ఫామ్‌ సాలెతో పాటు ఏసీఏ సిబ్బంది హాజరై తమ ఉత్సాహాన్ని కనబర్చారు. అంతేకాకుండ 19మ్యాచ్‌ల వివరాల్ని స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్‌ కేఎస్‌ భరత్‌తో అందరూ సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో ఏసీఏ నిర్వాహక కమిటీ ప్రతినిధులతో పాటు పోటీల నిర్వాహకులు, ఫ్రాంచైజీలు పాల్గొన్నారు.: https://v.inshotapp.net/invite

Use Social Media to Spread the Word about Our News

related articles