*ఎగుమతుల మార్కెట్ విశాఖదే ప్రశంసనీయ పాత్ర*. విశాఖపట్నం, జూన్20: భారత ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి సిద్ధం గా ఉందని, ఎగుమతుల మార్కెట్లో విశాఖ ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తుందని విశాఖ ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ అన్నారు. గురువారం నగరంలోని ఓ హోటల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ శాఖ ఆధ్వర్యంలోని నగరంలోని ప్రముఖ ఎగుమతిదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గోన్న పంకజ్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరావతి సర్కిల్ కుమార్ మోహిత్‌లు మాట్లాడుతూ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు, సరసమైన క్రెడిట్, పోటీ ట్రజరీ రేట్లు అందిస్తున్నట్లు తెలిపారు. విశాఖలోని ఈ బ్రాంచ్ ఎంతోఎ మంది పెద్ద, మధ్యతరగతి సంస్థల అవసరాలను తీరుస్తుందని, బ్రాంచ్ కస్టమర్ అవసరాలకు అనుగుణంగా అనేక ఉత్పత్తులు, సేవలను అందిస్తుందన్నారు. చిన్న, మధ్యతరగతి పరిశ్రమల నిర్వహించే వారికి సైతం ట్రేడ్ రీసివబుల్స్ ఎలక్ట్రానిక్ డిస్కౌటింగ్ సిస్టమ్‌పై ఇటీవలే కార్యకలాపాలను ప్రారంభించామన్నారు. ఈ సమావేశంలో పాల్గోన్న ఎక్సోపోర్టర్ కస్టమర్లకు వినియోగదారులకు అందిస్తున్న క్రెడిట్ అండ్ ఫారిన్ ఎకె ్సంజ్, వివిధ పధకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సిఐఐ ప్రతినిధులు సంబంధిత పధకాలు, విధానాలపై ప్రదర్శనలు కూడా చె శారు. ఈ సమావేశంలో విశాఖ రీజనల్ మేనేజర్లు సంజీవ్ కుమార్ దె బ్నాద్. బాల సుబ్రహ్మణ్యం. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఓవర్సీస్ బ్రాంచ్ చక్రధర్ గారపాటి తదితరులు పాల్గొన్నారు.
65
previous post