విశాఖలో మేక్ మై ట్రిప్ ట్రిప్ సంస్థ ఏర్పాటు బేస్ ఆన్లైన్ విధానంలో కూడా బుకింగ్ విశాఖపట్నం రాంనగర్

by vvwnews.com

విశాఖలో మేక్ మై ట్రిప్ సంస్థ ఏర్పాటు భేష్

– ఆఫ్ లైన్ విధానంలో కూడా బుకింగ్స్

– పశ్చిమ ఎమ్మేల్యే గణబాబు

విశాఖ పట్నం:

ప్రముఖ *టూరిజం* యాప్ మేక్ మై ట్రిప్
(*Make my Trip*) *అధునాతన స్టోర్* ప్రారంభించారు. ఈ మేరకు రామ్ నగర్ లయన్స్ క్లబ్ దగ్గర గల
వుడా కాంప్లెక్స్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన
సంస్థ కార్యాలయాన్ని విశాఖ పశ్చిమ
ఎమ్మెల్యే *గణబాబు* చేతులమీదుగా ఆదివారం ప్రారంభం అయ్యింది.
*ఏపీ టూరిజం డెవలప్మెంట్* లో భాగంగా నూతన ట్రావెల్ ప్యాకేజీ లు విదేశీ పర్యటనల సమాచారం గురించి ఆయన మాట్లాడారు. విశాఖకు ఇది ఒక కొత్త సౌకర్యం వచ్చింది. మేక్ మై ట్రిప్ ద్వారా విశాఖ ప్రజలు ఆన్లైన్ తో పాటుగా ఇప్పుడు ఆఫ్ లైన్ విధానంలో కూడా టూర్స్ బుకింగ్ చేసుకునే సౌలభ్యం వుందన్నారు. ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయడం విశేషం అన్నారు. విశాఖ లో జరిగిన
సమ్మిట్స్ ద్వారా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి అన్నారు.
పర్యాటకుల కు విశాఖ ఎంతో అనుకూలం అన్నారు. విశాఖ దేశంలోనే 9వ సంపన్న నగరం. భోగాపురం వద్ద
అంతర్జాతీయ ఎయిర్ పోర్టు రానుంది అని పేర్కొన్నారు. ఈ
సంస్థ కార్యకలాపాలు విజయవంతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు.
పైడా విద్యా సంస్థల అధినేత ఫైడా కృష్ణ ప్రసాద్,
మాట్లాడుతూ, మేక్ మై ట్రిప్ సంస్థ ఎంతో ప్రాచుర్యం గల సంస్థ అని గుర్తు చేశారు. ఆఫ్ లైన్ విధానంలో కూడా బుకింగ్స్ కోసం విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.
టూరిజం బాగా అభివృద్ధి చెందిన తరుణంలో ఇటువంటి సంస్థలు ఎంతయినా అవసరం అన్నారు.

సంస్థ ఫ్రాంచైజీ కార్యాలయం మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ ఆకార్, మాట్లాడుతూ, విశాఖలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం రావడం తమ అదృష్టం అన్నారు.
గత ఐదేళ్లలో ట్రావెలింగ్ పెరిగింది. విజయ నగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి అని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసులు కోసం
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వెల్లాల్సి వస్తుంది. ఇక నుంచి త్వరలోనే భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా నేరుగా అమెరికా, దుబాయ్, ఇంగ్లాండ్ తదితర
విదేశాలకు
హాలిడే ప్యాకేజీ ద్వారా టూర్స్ బుకింగ్ వుంటుంది అన్నారు.
విదేశాల్లో తమ సంస్థ ప్రతినిధులు అక్కడ షాపింగ్, సైట్ సీయింగ్ కోసం పూర్తి సహకారం అందిస్తారు. ఆఫ్ లైన్ బుకింగ్ వలన కుటుంబ సభ్యులు అవసరాలకు అనుగుణంగా ట్రావెల్ ప్యాకేజీ బుకింగ్స్ చేసుకునే అవకాశం వుంటుంది. ప్రపంచంలో 176 దేశాలకు టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు.

మేక్ మై ట్రిప్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ మనీష్ భారతి మాట్లాడుతూ, మేక్ మై ట్రిప్ సంస్థకు విశాఖలో ఇదే తొలి బ్రాంచ్ అని తెలిపారు. విదేశాల్లో ప్రజల ట్రిప్స్ విజయ వంతంగా జరిగేలా సంస్థ సహకారం వుంటుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో మేక్ మై ట్రిప్ అధికారి
వైభవ్, విశాఖ
బ్రాంచ్ మేనేజర్ బబిత, ఇతర సిబ్బంది
పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles