Edit మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి
– కళింగ సంక్షేమ సమితి అద్యక్షుడు రమణ
డాబా గార్డెన్స్ (విశాఖ దక్షిణ):
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కొలువుధీరిన వేళ అన్ని సామజిక వర్గాలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది ఉన్న కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించకపోవడం బాధాకరం అని కళింగ సంక్షేమ సమితి అద్యక్షుడు కే.వీ.రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో తమ సామాజిక వర్గమైన కళింగులకు తగిన ప్రాధాన్యత కల్పించి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు. ఈ మేరకు సంఘం ఆద్వర్యంలో శుక్రవారం డాబాగార్డెన్స్ వి జే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో నిర్ణయాత్మక శక్తిగా వున్నాం. విశాఖ లో లక్ష ఓట్లు, విజయ నగరంలో 15 వేలు ఓట్లు వున్నాయి. నెల్లూరులో ఇద్దరు కళింగ నేతల సహకారంతో సోమి రెడ్డి చంద్ర మోహన్ రెడ్డి విజయానికి కృషి చేసారు. శ్రీకాకుళం లో ఇద్దరు ఎమ్మెల్యేలు, బెందాళం అశోక్, కూన రవి కుమార్, గెలిచారు. చంద్ర బాబు నాయుడు స్పందించి వీరికి మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించాలి అని కోరారు.
పొందూరు సూర్య నారాయణ మాట్లాడుతూ, కూటమి నాయకులకు అభినందనలు తెలిపారు. 1953 నుంచి కళింగ సమితి గుర్తింపు కలిగి వుంది. 14 లక్షల జనాభా వుంది. లోకేష్ పాద యాత్ర లో తమకు ప్రాధాన్యత ఇస్తామని హామి ఇచ్చారు అని గుర్తు చేశారు.
డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ, శ్రీకాకుళం కళింగ సీమ గా పేరు గాంచింది. న్యాయ వాదీ నరసింహా స్వామి మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో కలింగులు ఎంతో సేవలు అందించారు అని తెలిపారు.
మీడియా సమావేశంలో కళింగ సంక్షేమ సమితి నాయకులు ఎం వీ రమణ, వెంకట్, సూర్యనారాయణ
పాల్గొన్నారు. InShot: https://inshotshare.app