మానసిక ఉల్లాసం కలిగించే వనాలతో భవిత విద్యా కేంద్రాలకు కొత్త వెలుగు గ్రీన్ క్లైమేట్ టీం

by vvwnews.com

మానసిక ఉల్లాసం కలిగించే వనాలతో భవిత విద్యా కేంద్రాలకు కొత్త వెలుగు
– విజయ భాస్కర్, రీజినల్ జాయింట్ డైరెక్టర్,
విద్యాశాఖ
మానసిక ఉల్లాసం కలిగించే ఇంద్రియ వనాలతో భవిత విద్యా కేంద్రాలకు కొత్త వెలుగు వచ్చిందని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయ భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం మధురవాడలోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులతో కూడిన భవిత విద్యా కేంద్రంలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇంద్రియ వనాలతో మానసిక వికాసం కలుగుతుందన్నారు. ప్రధానంగా మొక్కలు, పువ్వులు మానసిక వికాశానికి ఉపయోగపడతాయన్నారు. దీనిని దృష్టిలోనికి తీసుకొని విశాఖ మహానగరంలో భవిత విద్యా కేంద్రాలలో పూల మొక్కలు, ఔషధ మొక్కలు నాటడం ఆనందదాయకం అన్నారు.
ఏపీ స్టేట్ ఐడి కోఆర్డినేటర్ శైలా కల్పన
మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం అన్నారు. మూడేళ్లు పెరిగిన ఒక చెట్టు ఏడాదికి ఒక టన్ను ప్రాణవాయువు ఇస్తుందన్నారు. దీనిని దృష్టిలోనికి తీసుకొని ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటి పెంచాలన్నారు. అలా పెంచితే మన శీతోష్ణస్థితి చల్లబడుతుంది అన్నారు. అధిక సంఖ్యలో మొక్కలు నాటడానికి పెంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.
విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు అత్యధికంగా నాటాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అన్నారు. ప్రతి విద్యార్థి చేతా మొక్కలు నాటి పెంచే విధంగా చైతన్య వంతులు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అదనపు సమన్వయకర్త బి శ్రీనివాస్, ఐఇ కో ఆర్డినేటర్ బి గీత, ఎన్ జి సి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎస్ బాబూరావు, ఎం ఇఒలు రవీంద్ర బాబు, అనురాధ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు చేత పువ్వులు , ఔషధ మొక్కలు నాటారు

Use Social Media to Spread the Word about Our News

related articles